సినిమా ఇండస్ట్రీ లో ఉండి సినిమా పరిశ్రమ ద్వారా పరిచయం ఏర్పడి ఆ తర్వాత పెళ్లి వైపు అడుగులు వేసిన జంటలు ఎన్నో ఉన్నాయి. అలా సినిమాల ద్వారా పరిచయాలు ఏర్పడి ఆ తర్వాత పెళ్లి చేసుకున్న వారిలో కొంత మంది అన్యోన్యంగా జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటే మరి కొంత మంది మాత్రం అలా సాగించలేక మధ్యలోనే విడిపోయిన వారు కూడా ఉన్నారు. ఇకపోతే పైన ఫోటోలో ఓ అమ్మాయి కనిపిస్తుంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె ఇప్పటివరకు తెలుగులో అనేక సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా సింగర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగిన ఆ వివాహ బంధం మాత్రం ఎక్కువ రోజులు నిలబడలేదు. పెళ్లయిన 16 రోజులకే వారి మధ్య విభేదాలు తలెత్తడం మొదలు అయింది. ఆ తర్వాత మూడు నెలలకేవారు విడిగా ఉండడం , ఆ తర్వాత ఆరు నెలలకు విడాకులు తీసుకోవడం జరిగిపోయింది. ఇప్పటికైనా పైన ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా ..? ఆ నటి మరెవరో కాదు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి  ఎస్తర్ నోరోన్హా. 2013 లో విడుదల అయినా 1000 అబద్ధాలు అనే సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 

ఈ మూవీలో సాయి రామ్ శంకర్ హీరోగా నటించాడు. ఆ తర్వాత సునీల్ హీరోగా రూపొందిన భీమవరం బుల్లోడు మూవీలో ఈమె హీరోయిన్గా నటించింది. ఈమె ప్రముఖ నటుడు మరియు సింగర్ అయినటువంటి నోయల్ ను ఈమె వివాహం చేసుకుంది. వీరి వివాహ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. ప్రస్తుతం ఎస్తర్ నోరోన్హా కొన్ని సినిమాల్లో నటిస్తూ కెరియర్ను మంచి దశలోనే ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: