
కానీ ఇప్పుడు మాత్రం ఓ హీరోయిన్ చిరంజీవి సినిమాలో నటించను అంటూ చెప్పేసిందట . ఇది తెలుగు ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది . మనకు తెలిసిందే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార సెలెక్ట్ అయ్యింది. నయనతార - చిరు మధ్య వచ్చే సీన్స్ సినిమాకి బాగా హైలైట్ గా ఉండబోతున్నాయి అంటూ మేకర్స్ చెప్తున్నారు . ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశీ రౌతెలా ని అనుకున్నారట .
కానీ ఆమె బ్యాక్ టు బ్యాక్ చిరంజీవి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కనిపిస్తే బాగోదు అంటూ మూవీ మేకర్స్ వద్దనుకున్నారట . ఆ తర్వాత లక్ష్మి రాయ్ ను స్పెషల్ పాటలో చూపించాలి అంటూ అనుకున్నారట. గతంలో రత్తాలు రత్తాలు సాంగ్ ఎలా ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే . కానీ లక్ష్మీ రాయ్ మాత్రం ఈ పాటలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపలేదట . దానికి కారణం రెమ్యూనరేషన్ . ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ మేకర్స్ ఇవ్వలేకపోవడమే . ఆమె ఈ పాట చేయడానికి మెయిన్ కారణం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .
రాయ్ లక్ష్మికి ఇప్పుడు క్రేజ్ లేదు.. పాపులారిటీ లేదు . అయినా సరే అనిల్ రావిపూడి ఛాన్స్ ఇవ్వాలని చూసాడు. కానీ ఆమె రమ్యునరేషన్ కోసం చిరంజీవి సినిమా రిజెక్ట్ చేసింది అంటూ వార్తలు రావడంతో మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . మీ ఫేస్ కి ఇలాంటి ఆఫర్ రావడమే గొప్ప.. నువ్వే మా చిరంజీవిని రిజెక్ట్ చేస్తావా..? అంటూ ఘాటు ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది . అయితే ఇప్పుడు ఈ స్థానంలోకి మరో హీరోయిన్ ని దింపే ప్రయత్నం చేస్తున్నాడు అనిల్ రావిపూడి అంటూ తెలుస్తుంది . చూద్దాం మరి అనిల్ రావిపూడి ప్లానింగ్ ఏ లెవెల్ లో ఉంటుందో..? సినిమాకి ఏమేర ప్లస్ గా మారబోతుందో..???