- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్ హీరోయిన్గా బాబి డియోల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను మెగా సూర్యా ప్రొడక్షన్స్ బ్యానర్ పై అగ్ర నిర్మాత ఏం రత్నం దాదాపు రు. 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూ వస్తుంది. ఇప్పటికే కొన్నిసార్లు వాయిదాల మీద వాయిదాలు పెడుతుంది. దర్శకులు క్రిష్ జాగర్లమూడి - ఏఎం జ్యోతి కృష్ణ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ తొలిసారిగా హిస్టారికల్ సినిమాలో నటించడంతోపాటు భారీ పాన్ ఇండియా స్థాయిలో హరిహర వీరమల్లు రిలీజ్ అవుతూ ఉండడంతో అభిమానులతో పాటు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


సినిమా బిజినెస్ పరంగా కూడా ఏరియా ల వారిగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నట్టు టాలీవుడ్ ట్రేడ్ సర్కిల్ చర్చలు నడుస్తున్నాయి. మొన్న ట్రైలర్ వచ్చిన తర్వాత మరిన్ని అంచనాలు సెట్ చేసుకుంది. ఇక సీడెడ్ లో ఈ సినిమా భారీ రేటుకు డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఒక్కసీమ ప్రాంతం నుంచి 23 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో స్టార్ హీరో సినిమాలలో ఇది బిగ్ డీల్ అని చెప్పాలి. మరి రిలీజ్ అయ్యాక వీరమల్లు ఏ రేంజ్ లో వ‌సూళ్లు సాధిస్తుందో చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: