1994 అక్టోబర్ - తెలుగు సినీ చరిత్రలో మరచిపోలేని మలుపు . ఒక నటుడి మించిన నేతృత్వం.. పరిశ్రమకి సంకెళ్లు విప్పిన సంఘటన. ఇందులో కేంద్ర బిందువయినది .. కోట శ్రీనివాసరావు చేపట్టిన నిరాహార దీక్ష. ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ భారత చలనచిత్ర సమాఖ్యల మధ్య జరిగిన వివాదం సినీ రంగాన్ని స్తంభింపజేసింది. షూటింగ్స్ నిలిచిపోయాయి. పనుల్లేక కార్మికుల జీవితం నిలిచిపోయింది. ఈ సంక్షోభంలో కోట శ్రీనివాసరావు చేపట్టిన నిరాహార దీక్ష పరిశ్రమలో స్ఫూర్తిని నింపింది. కోట శ్రీనివాసరావు తన వ్యక్తిగత పేరు , ఇమేజ్‌తో పనిలేకుండా, పరిశ్రమకి , కార్మికులకి రిఫరెన్స్‌లా నిలిచారు. అన్ని వర్గాల నుంచి నటులు , నిర్మాతలు , దర్శకులు వచ్చి ఆయన దీక్షకు మద్దతుగా నిలిచారు . చివరికి స్టార్ హీరోలు వచ్చి నిమ్మరసం తాగించి ఆయన దీక్షను ముగింపునకు తీసుకువచ్చారు .


హైదరాబాద్‌లో మళ్ళీ షూటింగులు ప్రారంభమైన రోజు - ఇది కోట దీక్ష సాధించిన విజయానికి నిదర్శనం . కోట శ్రీనివాసరావు కు ‘8’ అనే నంబర్‌తో ప్రత్యేక అనుబంధం ఉండేది . "కోటష‌ - తెలుగులో ఎనిమిది అక్షరాలు "Kota Sreenivasa Rao" - ఇంగ్లీషులోనూ 8 అక్షరాల సరళి , ‘ప్రతిఘటన’ – అతనికి మంచి పేరు  తెచ్చిన చిత్రం రిలీజ్ తేదీ కూడా 8కి సంబంధించింది .. రోడ్ నం.8 - ఆయన నివాసం కూడ అదే నంబరు తో ఉండేది .. తన జీవితంలో ఇది , యాదృచ్ఛికంగా వస్తూ ఉండటంతో, దానిపై ఒక సెంటిమెంటల్ గౌరవం ఏర్పడింది. ఇది కోట శ్రీనివాసరావు వ్యక్తిత్వాన్ని, విలువలను, పరిశ్రమ పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేసే గొప్ప ఉదాహరణ . ఒక నటుడు తన నటనతోనే కాదు .. తన ఉద్యమంతో కూడా చరిత్రలో నిలిచిపోయారు.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: