మరి కొన్ని రోజుల్లోనే తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే సీజన్ 9 కు సంబంధించిన ప్రోమో కూడా వచ్చేసింది. ఈ ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా ఉంది. తెలుగులో బిగ్ బాస్ టీవీ షో చాలా రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 మనకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా , రెండవ సీజన్ కి నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఇక మూడవ సీజన్ నుండి ఇప్పటివరకు తెలుగులో జరిగిన బుల్లి తెర మరియు ఓ టీ టీ అన్ని సీజన్లోకి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. తెలుగులో ఒక ఓ టి టి సీజన్ కంప్లీట్ అయింది. ఇక కొంత కాలం క్రితం వరకు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 కు నాగార్జున కాకుండా మరో వేరే హీరో హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు అని వార్తలు వచ్చాయి. కానీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. తాజాగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎంట్రీ ఇచ్చేది వీరే అంటూ కొంత మంది పేర్లు బయటకు వచ్చాయి. మరి ఆ లిస్టులో ఉన్న వారు ఎవరు అనేది తెలుసుకుందాం.

సోషల్ మీడియా ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకొని యూత్ ఆడియన్స్ లో మంచి గుర్తింపును దక్కించుకున్న అలేఖ్య చిట్టి పికిల్స్ ఫెమ్ రమ్య మోక్ష ఈ సీజన్లో హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే రీతూ చౌదరి , తేజస్విని , నవ్య స్వామి , జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయల్ , నటుడు సాయికిరణ్ ,  ముఖేష్ గౌడ , శివ కుమార్ , సుమంత్ అశ్విన్ , దేబ్జాని తదితరులు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ లిస్టులో ఉన్న వారిలో చాలా మంది కి జనాల్లో మంచి క్రేజ్ ఉంది. మరి ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: