తమిళ సినీ పరిశ్రమలో తాజాగా తీవ్ర విషాద ఛాయలు నెలకొంది. కోలీవుడ్లో పాపులర్ స్టంట్ మాస్టర్ గా పేరు పొందిన రాజు ఒక ప్రమాదంలో తన ప్రాణాలను కోల్పోయారు.. ఆర్య హీరోగా, డైరెక్టర్ రంజిత్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్రానికి రాజు స్టంట్ మాస్టర్ గా పనిచేస్తున్నారు. బుధవారం రోజున సినిమా షూటింగ్లో భాగంగా స్టంట్ మాస్టర్ రాజు ఒక కారు స్టంట్ చేస్తూ ఉండగా యాక్సిడెంట్ కి గురయ్యారని దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారట. ఈ విషయం తమిళ సినీ ఇండస్ట్రీలో పెను విషాదాన్ని నింపింది.


అయితే స్టంట్ మాస్టర్ రాజు మరణ వార్తను స్టార్ హీరో విశాల్ అధికారికంగా ప్రకటించారు. విశాల్ హీరోగా నటించిన చాలా చిత్రాలకు రాజునే స్టంట్ మాస్టర్ గా పనిచేశారట. దీంతో సోషల్ మీడియా వేదికగా అతనికి నివాళులు అర్పించారు హీరో విశాల్. అంతేకాకుండా స్టంట్ మాస్టర్ రాజు కుటుంబానికి కూడా అండగా ఉంటాం అంటూ భరోసాని ఇచ్చారు. ఈరోజు ఉదయం సినిమా షూటింగ్ సమయంలో  రాజు మరణించారనే వార్త తెలియడం జీర్ణించుకోలేని విషయం అంటూ తెలిపారు విశాల్. తన సినిమాలకు స్టంట్ మాస్టర్ గా రాజు పనిచేశారని అతను లేడని విషయం నమ్మలేకపోతున్నాను అతని ఆత్మకు శాంతి చేకూరాలంటూ తెలిపారు.



కానీ స్టంట్ మాస్టర్ రాజు  సినిమా షూటింగ్లో మరణించిన అటు హీరో ఆర్య కాని, డైరెక్టర్ పా రంజిత్ గాని ఇప్పటివరకు ఏ విధంగా స్పందించకపోవడం తో చాలామంది ఫైర్ అవుతున్నారు. అయితే చాలా సందర్భాలలో సినీ పరిశ్రమకు చెందిన కార్మికులు లేదా స్టంట్ మాస్టర్స్ ప్రమాదకరమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్న ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మరి హీరో ఆర్య కాని, డైరెక్టర్ పా రంజిత్ స్టంట్ మాస్టర్అయిన రాజు కుటుంబానికి ఏదైనా సహాయం చేస్తారేమో చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: