టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల వేటలో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. 'వార్ 2' షూటింగ్ ముగించేసి, ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. జూన్ 25, 2026 రిలీజ్ డేట్ టార్గెట్‌గా జెట్ స్పీడ్‌లో షూటింగ్ నడుస్తోంది. అలాంటి బిజీ షెడ్యూల్ మధ్యే తారక్ తాజాగా కోట శ్రీనివాసరావు కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు - నటనకు ప్రాణం అద్దిన లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు మృతి. కోట శ్రీనివాసరావు మృతి తో సినీ ఇండస్ట్రీ కి తీరని లోటు ఏర్పడింది. ఆదివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. దీనికి స్పందనగా తారక్, కోట ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.


‘మహానటుడు కోట .. ప్రతి పాత్రలో జీవించిన నటుడు. ఆయనతో గడిపిన క్షణాలు నా సినీ ప్రయాణంలో మరపురానివి’ అని మీడియాతో ఎమోషనల్‌గా పంచుకున్న తారక్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది . కానీ.. ఈ సందర్శనలో తారక్ లుక్ అదిరిపోయేలా కాకుండా షాక్‌కి గురిచేసింది. కారణం - తారక్ బాగా సన్నగా కనిపించడం ! ముఖంలో ఓ క్లారిటీ లేదు , కంటెంట్ లేదు అన్నట్టు కనిపించడం తో అభిమానులు కంగారు పడిపోతున్నారు. ‘‘తారక్ ఏమయ్యాడు?’’ ‘‘అంతగా తగ్గాల్సిన అవసరం ఏముంది?’’ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ టెన్షన్ లో పడిపోయారు. అయితే మరికొందరు మాత్రం ఇది ప్రశాంత్ నీల్ మూవీకి సంబంధించిన లుక్ అవుతుందని క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు .


ఇక ఇదే విషయమై కొన్ని రోజుల క్రితం కూడా ఓ ఫంక్షన్‌లో తారక్ కనిపించినప్పుడు ఇదే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మరోసారి ఈ డిబేట్ మొదలైంది . తారక్ మాత్రం ఇంకా దీని పై స్పందించలేదు . యదార్థంగా చెప్పాలంటే.. కోట మృతికి తారక్ హాజరై స్పందించడం, ఇంటికి వెళ్లి పరామర్శించడం ఆయన హృదయాన్ని, భావోద్వేగాలను చాటింది. అదే సమయంలో తన కొత్త సినిమా లుక్‌తో మరోసారి ఫ్యాన్స్‌లో టెన్షన్ కూడా రేపాడు. ఆయన దగ్గర నుంచి క్లారిటీ రాగానే అభిమానుల గుండెల్లోని గందరగోళం తొలిగే అవకాశం ఉంది. ఇక మ‌రి దీనిపై ఎన్టీఆర్ ఎలా రెస్పాండ్ అవుతారేమో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: