
వాస్తవానికి తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ రీత్యా ఈసినిమా ఓపెనింగ్ కలక్షన్స్ విషయంలో ఎలాంటి సందేహం లేనప్పటికీ ఆతరువాత ఈ మూవీకి హిట్ ముద్ర పడాలి అంటే ఈమూవీకి టోటల్ పాజిటివ్ టాక్ రావాలి. ఇలాంటి పరిస్థితులలో అనుకున్న లక్ష్యాలు చేరుకోవడానికి విపరీతంగా ప్రమోట్ చేయాలి. అయితే ఈవిషయంలో ‘హరి హర వీరమల్లు’ పూర్తిగా శ్రద్ద పట్టడంలేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి.
దీనికితోడు ఈమూవీని పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు. హైందవ ధర్మం పరిరక్షణ కోసం పోరాడిన వ్యక్తి కథ వీరమల్లు కాబట్టి ఈ కథ ఉత్తరాది ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది అన్న అంచనాలు ఉన్నప్పటికీ ఈమూవీ ‘కార్తికేయ 2’ ‘కాంతార’ తరహాలో సూపర్ హిట్ అవ్వాలి అంటే ఈమూవీని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయాలి. కానీ అలాంటి ప్రమోషన్ ఈ సినిమాకు సంబంధించి ఎక్కడా కనిపించడంలేదు.
భారీ ఓపెనింగ్స్ తో పాటు వీకెండ్ మొత్తం స్ట్రాంగ్ రన్ రావాలంటే ఈమూవీ ప్రమోషన్ భారీ స్థాయిలో జరిగితే కానీ అంచనాలు చేరుకోవడం కష్టం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి ఈసినిమాకు ఎటువంటి కాంపిటీషన్ లేదు. దీనితో ఈ అవకాశాన్ని ఈ మూవీ వదులుకోకుండా భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాలు పవన్ అభిమానులలో కలుగుతున్నాయి. దీనికితోడు తెలుగు రాష్ట్రాలలో అయినా ఈమూవీకి భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తారా లేదా అన్న సందేహాలు కూడ పవన్ అభిమానులను వెంటాడుతున్నట్లు టాక్..