
వ్యక్తిగత జీవితంలో ఎమోషనల్ చాప్టర్ .. ధనశ్రీ, భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌తో 2020 డిసెంబర్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కానీ, 2023లో వారిద్దరి మధ్య మనస్పర్థులు తలెత్తగా, 2025 మార్చి 20న ముంబై ఫ్యామిలీ కోర్టు వారి విడాకులను ఆమోదించింది. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం, ఫోటోలు తీసివేయడం వంటి చర్యలు అప్పట్లో హల్‌చల్ చేశాయి . ధనశ్రీ తాజా ప్రాజెక్ట్ – డ్యాన్స్‌తో దూసుకెళ్తున్న స్టార్ .. విడాకుల తర్వాత కూడా ధనశ్రీ తన ప్రొఫెషనల్ కెరీర్‌లో మంచి దూకుడు చూపిస్తున్నారు. ఇటీవల ఆమె 'భూల్ చుక్ మాఫ్' అనే చిత్రంలోని ‘టింగ్ లింగ్ సజ్నా’ పాటలో స్టన్నింగ్ అండ్ ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో కనిపించారు. ఈ వీడియోకు పెద్ద ఎత్తున వ్యూస్ వచ్చాయి.
ఇంకెవరు బిగ్ బాస్‌లో? ... ధనశ్రీతో పాటు ఈ సీజన్‌లో ఇతర ప్రముఖులు కూడా ఉండనున్నారు. ముఖ్యంగా ‘ఇండియన్ ఐడల్ 5’ ఫేమ్ శ్రీరామ చంద్ర పేరూ వినిపిస్తోంది. ఈ సీజన్‌కి సంబంధించి బిగ్ బాస్ టీం ఇప్పటికే భారీ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఆగస్టు చివరి వారంలో హీంది ‘బిగ్ బాస్ 19’ ప్రారంభం కానుందని, ఇది ఇప్పటివరకు అత్యంత పొడవుగా నడిచే సీజన్ అవుతుందని తెలుస్తోంది. రియాలిటీ షోలో కొత్త అధ్యాయం ... ధనశ్రీ వర్మ పర్సనల్ లైఫ్, పాపులారిటీ, డ్యాన్స్ స్కిల్స్.. ఇవన్నీ కలిపి బిగ్ బాస్ 19కి మరింత పాపులారిటీ తీసుకొస్తాయనడంలో సందేహం లేదు. అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో ఆమెకు మద్దతుగా పోస్టులు షేర్ చేస్తున్నారు. ఇక షో స్టార్ట్ అయితే ఆమె ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తారో చూడాల్సిందే!