
ఈ సినిమా గురించి అప్పుడప్పుడు పలు రకాల ఇంటర్వ్యూలలో కూడా తెలియజేస్తూ వార్ 2 సినిమాకి హైప్ తీసుకువచ్చేలా చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరొకసారి నాగ వంశీ ఈ చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్డేట్ తెలియజేశారు.. కింగ్డమ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగ వంశీ మీడియాతో మాట్లాడుతూ.. వార్ 2 లో ఎన్టీఆర్ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని దాని గురించి ఎక్కువగా రివీల్ చేయకూడదని. ఫ్యాన్స్ సరికొత్త అనుభూతిని పొందుతారు అంటూ తెలియజేయడం జరిగింది నాగ వంశీ.
టైటిల్ కి తగ్గట్టుగానే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య సన్నివేశాలు విజువల్స్ వండర్లా కనిపిస్తాయని ఇద్దరు కూడా ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్ అయినప్పటికీ కూడా నువ్వా నేనా వార్నింగ్ ఇచ్చుకుంటూ కొట్టుకుంటుంటే చూసేందుకు ఎలా ఉంటుందో చూడడానికి వార్ 2 చిత్రాన్ని కొనుగోలు చేశానంటూ తెలిపారు. తాజాగా నాగ వంశీ చేసిన కామెంట్స్ కి ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి లో ఉన్నారు. అలాగే మరొకవైపు వార్ 2 సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఏర్పాటు చేసినట్లు నాగ వంశీ తెలుస్తోంది. ఆగస్టు 14వ తేదీన ఉదయం షోలు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి మొదటి రోజు ఏ విధంగా కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి మరి.