
హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటి సంస్థలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ రూ.50 కోట్లకు కొనుగోలు చేసినట్లు వినిపిస్తున్నాయి. సినిమా థియేటర్లో విడుదలైన 40 రోజుల తర్వాత అమెజాన్ ప్రైమ్ లో స్ట్రిమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొదటి రోజే రూ.50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించవచ్చని సినీ విశ్లేషకులు తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలైన మొట్టమొదటి సినిమా కావడం చేత భారీగానే హైప్స్ ఏర్పడ్డాయి. థియేటర్ల వద్ద ఇప్పటికీ కూడా అభిమానులు హంగామా సృష్టిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల కూడా కావాలనే యాంటి ఫ్యాన్స్ నెగటివ్ టాక్ ను స్ప్రెడ్ చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి .
ఏ.ఎం.రత్నం కూడా ఈ చిత్రానికి ఎక్కడా కూడా బడ్జెట్ విషయంలో వెనకడుగు వేయలేదు. భారీ తరాగణంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. రూ.250 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఎంతటి లాభాలను అందిస్తుందో చూడాలి మరి. రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.103 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా సమాచారం. మొత్తానికి ఈరోజు సాయంత్రం కూడా సక్సెస్ మీట్ ని హైదరాబాదులో భారీగానే ఏర్పాటు చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఏం మాట్లాడతారో చూడాలి.