ఆగష్టు నెల 14వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న కూలీ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ కనగరాజ్ "లియో" తర్వాత దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం, రజనీకాంత్‌తో ఆయన మొదటిసారి కలిసి పనిచేయడం ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు. ఈ చిత్రం ఆగస్టు 14న జూనియర్ ఎన్టీఆర్-హృతిక్ రోషన్ నటించిన "వార్ 2"తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది.

వార్2 వర్సెస్ కూలీ పోటీలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద పైచేయి సాధిస్తుందనే చర్చ జరుగుతోంది.  రజనీకాంత్ ఈ సినిమా షూటింగ్ సమయంలో తన ఆత్మకథను కూడా రాస్తున్నారని దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో  వెల్లడించిన సంగతి తెలిసిందే. కూలీ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు 44 కోట్ల రూపాయలకు అమ్ముడవగా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో  ఏ స్థాయిలో సంచలనాలు సృస్తిస్తుందో చూడాల్సి ఉంది.

ఆసియన్ సునీల్సినిమా హక్కులను సొంతం చేసుకున్నారు.  ఒక సాధారణ వ్యక్తికి, అండర్‌వరల్డ్ మాఫియాకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రధానంగా బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో కథ నడుస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 300 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. "కూలీ" ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ ₹120 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

సినిమా ట్రైలర్ ఆగష్టు నెల 2వ తేదీన విడుదల కానుంది.  ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని సమాచారం.   భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కగా సన్ పిక్చర్స్ బ్యానర్ కు సైతం ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమని చెప్పవచ్చు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: