
నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ సినిమా నుంచి వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకు పోతున్నాడు. వరుసగా అఖండ ఆ తర్వాత వీరసింహా రెడ్డి .. ఆ తర్వరాత భగవంత్ కేసరి.. ఇక ఈ యేడాది సంక్రాంతికి డాకూ మహారాజ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి వరుసగా సూపర్ డూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే డాకూ మహారాజ్ సినిమా పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట వెంకటేశ్వర థియేటర్ లో నేటితో డైరెక్ట్ గా రోజూ 4 ఆటలతో 200 రోజులు పూర్తి చేసుకుంది. వరుసగా చిలకలూరిపేట సినీచరిత్ర లో 2 చిత్రాలు డైరెక్ట్ గా 200 రోజులు రన్నింగ్ రోజూ 4 ఆటలతో ఆల్ టైమ్ జిల్లారికార్డు సృష్టించిన ఏకైక హీరో గా బాలకృష్ణ రికార్డుల కు ఎక్కాడు.
చిలకలూరిపేట అంటేనే నందమూరి హీరోల సినిమాలకు అడ్డాగా మారింది. బాలయ్య నటించిన చివరి నాలుగు సినిమాలు కూడా ఇక్కడ సెంచరీ కొట్టడం విశేషం. ఈ సెంటర్ లోని రామకృష్ణ , వెంకటేశ్వర థియేటర్ల లో బాలయ్య సినిమాలు 200 రోజులు ఆడేశాయి. ఇక బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం లో నటిస్తోన్న అఖండ 2 - తాండవం సినిమా లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు