
త్రిష హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఈ సినిమాలో హైలెట్ గా ఉంటుంది. ఈ సినిమాని మహేష్ బాబు బర్త డే సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు . అతడు రీ రిలీజ్ కు ఓవర్సీస్ లోను అద్భుతమైన స్పందన లభిస్తుంది. అంతేకాదు తెలుగు రాష్ట్రాలలో కూడా బుకింగ్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. నైజాం ఏరియాలో ఏషియన్ సునీల్ భారీ ఎత్తున అతడు మూవీని రీ రిలీజ్ చేస్తూ ఉండడం గమనార్హం .
ఇక హైదరాబాదులోనే సుదర్శన్ 35 ఎం ఎం ,దేవి థియేటర్స్ లాంటి ప్రముఖ థియేటర్స్ లో కూడా ఈ మూవీ విడుదల అవుతూ ఉండడం మరింత హైలెట్ గా మారింది . ఆల్రెడీ హౌస్ ఫుల్ బోర్డులు కనిపించేస్తున్నాయి . ఈ ఒక్క విషయంతో చెప్పేయొచ్చు మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంది అనేది . అయితే తిరుపతిలోని పలని థియేటర్లో అతడు మూవీ చూసేందుకు సిద్ధమైన అభిమానులు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఐదు వందల కిలోల పేపర్లు రెడీ చేసుకున్నారు. వాటిని కట్ చేయించి 11:30 గంటలకి ..అలాగే సాయంత్రం 6:30 గంటల షోలల్లో విసిరి హంగామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు . వారు పేపర్ కటింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఖుషి అయిపోతున్నారు . అంతేకాదు మహేష్ బాబు సినిమా అంటే ఆ మాత్రం హంగామా ఉండాల్సిందే అంటున్నారు జనాలు . మొత్తానికి అతడు సినిమా రీ రిలీజ్ లోను రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది అని చెప్పుకోవడంలో సందేహమే లేదు..!!