
మెగాస్టార్ చిరంజీవి – వశిష్ఠ డైరెక్షన్‌లో రూపొందుతున్న పౌరాణిక-యాక్షన్ డ్రామా శంకరపల్లిలో జరుగుతోంది. అదే స్పాట్‌లో రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న పెద్ది సినిమా కూడా పలు సన్నివేశాలు షూట్ జరుగుతుంది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ – హరీష్ శంకర్ డైరెక్షన్‌లోని ఉస్తాద్ భగత్ సింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో మాస్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరిస్తోంది. ఫ్యాన్స్ మాస్ మూడ్‌లో రెడీగా ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ బాంబ్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ అవుతోంది. రామ్ పోతినేని – ఆంధ్రా కింగ్ ముచ్చింతల్‌లో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ పిక్చరైజ్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ – సంబరాల ఏటిగట్టు తుక్కుగూడలో ఫుల్ ఫ్యామిలీ ఫన్ సీన్స్ జరుగుతున్నాయి.
విజయ్ సేతుపతి – పూరీ జగన్నాథ్ కాంబో – అల్యూమినియం ఫ్యాక్టరీలో మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లతో సందడి చేస్తున్నారు. నాగచైతన్య – కార్తీక్ దండు దర్శకత్వంలో అడ్వెంచరస్ యాక్షన్ మూవీ అన్నపూర్ణ స్టూడియోస్లో స్పెషల్ సెట్‌లో తెరకెక్కుతోంది. తేజ సజ్జా – మిరాయి రామోజీ ఫిల్మ్ సిటీలో ఫ్యూచరిస్టిక్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సిద్దు జొన్నలగడ్డ – తెలుసు కదా సినిమా శంకరపల్లిలో క్రూషియల్ సన్నివేశాలు షూట్ అవుతున్నాయి. అఖిల్ అక్కినేని – లెనిన్ మూవీ బూత్ బంగ్లాలో థ్రిల్లర్ సీన్స్‌తో సెట్స్‌పై సందడి చేస్తున్నారు. ఇలా టాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా ఆన్‌ఫైర్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. ఈ హాఫ్‌లో రిలీజ్ అవుతున్న సినిమాలు బాక్సాఫీస్‌ను కుదిపేస్తాయని ట్రేడ్ టాక్. ఇప్పుడు ఫ్యాన్స్‌కి ఒక్క మాట – "ఈ ఆరు నెలలు… కుర్చీలకు బెల్ట్ వేసుకోండి, ఎంటర్‌టైన్‌మెంట్ రోలర్‌కోస్టర్ రాబోతోంది!"