టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తారక్ తన కెరీర్లు మొట్ట మొదటి సారి వార్ 2 అనే హిందీ సినిమాలో నటించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ లో తారక్ తో పాటు బాలీవుడ్ స్టార్ నటులలో ఒకరు అయినటువంటి హృతిక్ రోషన్ కూడా నటించాడు. మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అయినటువంటి కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ పోయిన నెల అనగా ఆగస్టు 14 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయింది.

సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయిన బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలం అయింది. దానితో ఈ సినిమా పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేయలేక పోయింది. ఇది ఇలా ఉంటే చాలా మంది ఈ సినిమా ఎప్పుడు ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇస్తుందా ..? ఎప్పుడు చూద్దామా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక తారక్ అభిమానులు కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచిన ఓ టీ టీ ప్రేక్షకులను మాత్రం అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటుంది అని అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే తాజాగా ఈ మూవీ ఓ టి టి ఎంట్రీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్  సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా అక్టోబర్ 9 వ తేదీ నుండి ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు హిందీ , తెలుగు , తమిళ్ భాషల్లో అందుబాటు లోకి తీసుకు రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ మూవీ ఓ టి టి ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: