
అయితే క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేయడం ఈ నాటికీ శాపంగా మారిందని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ నటి మాట్లాడుతూ ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మానాన్న ప్రేమ దక్కలేదని నా విషయంలో నా తండ్రే సరిగ్గా లేడని ఆమె చెప్పుకొచ్చారు. నాన్న నన్ను చీపురుతో, చెప్పులతో కొట్టేవాడని ఆమె చెప్పుకొచ్చారు. నాన్న నన్ను కాపర్ వైర్ తో కొడితే నా చర్మం ఊడిపోయేదని ఆమె కామెంట్లు చేశారు.
ఆ చర్మం ఊడిన చోట కారం పొడి చల్లేవారని పాతికేళ్ళు వచ్చే వరకు నేను దెబ్బలు తినకుండా ఉన్న రోజు లేదని ప్రతిరోజూ నేను ఏడ్చేదానినని 25సంవత్సరాల వరకు నా పరిస్థితి ఇదేనని ఆమె చెప్పుకొచ్చారు. అమ్మ, నేను ఎక్కువ దెబ్బలు తిన్నామని నాకు నలుగురు చెల్లెళ్లు అని ఆమె వాపోయారు. నాన్న చాలా రిచ్ అయినా బీటెక్ చదివే సమయంలో కేవలం 100 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చేవారని ఆ డబ్బులకు కూడా నాన్న లెక్కలు అడిగాడని ఆమె అన్నారు.
నాకు మందు తాగడం ఇష్టం లేకపోయినా బలవంతంగా తాగిపించారని నిర్మాత నా డ్రెస్ లాగడానికి ట్రై చేశాడని ఆమె తెలిపారు. పెళ్లి వల్ల రెండు సంవత్సరాలు నేను నరకం చూశానని భర్త నా జుట్టు పట్టుకుని గోడకేసి బాదేవాడని ఆమె చెప్పుకొచ్చారు. రక్తం వచ్చినా పట్టించుకునేవారు కాదని ఆమె అన్నారు. ఆ సమయంలో చనిపోవడానికి ప్రయత్నించానని గాయత్రి తెలిపారు.