సాధారణంగా ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా, బాక్సాఫీస్ వద్ద ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. థియేటర్ల వద్ద పూలదండలు, ఫ్లెక్సీలు, కటౌట్లు, పాలాభిషేకాలు, కొంతమంది ఏకంగా జంతు బలి వంటి చేస్తూ రకరకాలుగా సందడి చేస్తూ ఉంటారు. అది మొత్తం వాళ్ల అభిమానమే, అందులో తప్పుగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అయితే, ఎప్పటిలాగే ఈసారి సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ మూవీ విషయంలో ఫ్యాన్స్ ప్రవర్తిస్తున్న తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రజనీకాంత్ నటించిన ఏ సినిమా థియేటర్‌లో రిలీజ్ అయినా ఫ్యాన్స్ హంగామా చేస్తారు .  అది సహజమే. కానీ, ఏ సినిమా విషయంలో చేయని స్థాయిలో ఈ కూలీ కోసం చేస్తున్నారు రజనీకాంత్ ఫ్యాన్స్.


ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా, ఒక పెద్ద టీమ్‌ను రెడీ చేశారు. కూలి సినిమాకు ఎవరైనా నెగిటివ్ రివ్యూలు ఇవ్వాలని లేదా నెగిటివ్ కామెంట్లు చేయాలని ప్రయత్నిస్తే, వెంటనే కౌంటర్ ఇవ్వాలన్న పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు. రజనీకాంత్ ఫ్యాన్స్ ఆల్రెడీ సినిమాకు పాజిటివ్ టాక్ తెచ్చారు. అయితే, తెలుగు ఇండస్ట్రీలో మాత్రం “ఓకే… ఓకే” అనే టాక్ వచ్చింది. ఈ కారణంగా, సోషల్ మీడియాలో కూలి  సినిమా ఫ్లాప్ అని ఎవరైనా నెగిటివ్ రివ్యూ ఇస్తే, వెంటనే కౌంటర్ ఇవ్వాలని ఒక స్పెషల్ టీమ్ అలర్ట్ అయింది. అంతేకాదు, థియేటర్ల వద్ద ఎవరైనా రివ్యూవర్స్ “సినిమా బాగాలేదు” అని చెప్పి కావాలని నెగిటివిటీ క్రియేట్ చేస్తారేమో అని భావించి, రజనీకాంత్ ఫ్యాన్స్ అన్ని చోట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.



ఇప్పటివరకు రజనీకాంత్ నటించిన ఏ సినిమాకు ఇలాంటి పరిస్థితి రాలేదు. ఈసారి ఇంత కఠినమైన నిర్ణయానికి కారణం దీనికి పోటీగా మరో బిగ్ సినిమా వార్ 2 రిలీజ్ అవుతూ ఉండటం. అందువల్ల, ఫ్యాన్స్ మధ్య గొడవలు రాకుండా “ఏ హీరో ఫ్యాన్స్, ఆ హీరోకే సపోర్ట్ చేయాలి” అనే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా కనబడుతున్నాయి. చూడాలి మరి… రజనీకాంత్ నటించిన "కూలి" సినిమా హిట్ అవుతుందా..? లేదా తారక్హృతిక్ రోషన్ నటించిన వార్ 2 సినిమా హిట్ అవుతుందా..?  అనేది… ఇక మరికొద్ది గంటల్లో తేలిపోనుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: