గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమా లో నటిస్తున్నాడు. గ్రామీణ క్రీడల నేపథ్యంలో సాగే ఈ సినిమా పూర్తిగా రూరల్ మాస్ ఫీలింగ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. . ఇప్పటికే షూటింగ్ నుంచి బయటకు వచ్చిన చరణ్ లుక్, ఊరమాస్ స్టైల్, గ్రామీణ వాతావరణం అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి .. ‘రంగస్థలం’ తరహాలో మాస్ అండ్ ఎమోషనల్ ప్యాకేజీ ఉండే అవకాశం ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంద‌నే ఉత్కంఠ సినీప్రియుల్లో ఎక్కువవుతోంది ..


ఇక ఇదిలా ఉండగా, రామ్ చరణ్ తదుపరి సినిమా గురించి ఇండస్ట్రీలో హాట్ టాక్ మొదలైంది .. చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తెరకెక్కించనున్నాడనే విషయం ఇప్పటికే అధికారికంగా వెల్లడయింది. ఈ కాంబినేషన్‌పై అంచనాలు సహజంగానే ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ బ్లాక్‌బస్టర్ హిట్ మాత్రమే కాదు, ఇండస్ట్రీ రికార్డులు కూడా తిరగరాసింది. ఆ సినిమాలో చరణ్ చేసిన "చిట్టిబాబు" పాత్ర, అతని డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. .


తాజాగా, సుకుమార్ రామ్ చరణ్ కోసం ‘రంగస్థలం సీక్వెల్’ కథ సిద్ధం చేస్తున్నాడనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. రంగస్థలం ముగిసిన స్థాయిలోనే కథను కొనసాగించే విధంగా, కొత్త కాన్సెప్ట్‌తో, మరింత ఎమోషన్, యాక్షన్ మేళవించి స్క్రీన్‌ప్లే సిద్ధం చేస్తున్నాడట. సుకుమార్ ప్రత్యేకత అయిన రూరల్ నేటివిటీ, సస్పెన్స్ ఎలిమెంట్స్, స్ట్రాంగ్ విలన్ క్యారెక్టరైజేషన్ ఈ సీక్వెల్‌లో కీలకంగా ఉండనున్నాయని టాక్. కథ రూపకల్పన దశలోనే ఈ సినిమా కోసం భారీ ప్రొడక్షన్ ప్లానింగ్ జరుగుతోందని సమాచారం. రంగస్థలం సీక్వెల్ వస్తే, అభిమానులే కాదు, ట్రేడ్ వర్గాల్లోనూ ఇది భారీ క్రేజ్ తెచ్చిపెట్టడం ఖాయం. .

మరింత సమాచారం తెలుసుకోండి: