
ఢిల్లీలో జన్మించిన కృతి సనన్.. తెలుగు సినిమాతోనే హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి పలు సక్సెస్‌ఫుల్ సినిమాలతో అనతి కాలంలోనే భారీ స్టార్డమ్ సంపాదించుకుంది. `మిమీ` మూవీతో వెర్సటైల్ యాక్ట్రెస్ అనే బిరుదుతో పాటు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. ఆకట్టుకునే అందం, అసాధారణ నటనకు పేరుగాంచిన కృతి సనన్.. ఐఎండీబీ యొక్క టాప్ 10 మోస్ట్ బ్యూటిఫుల్ యాక్టర్స్ ఇన్ వరల్డ్ లిస్ట్‌లో స్థానం దక్కించుకుని భారతదేశం గర్వపడేలా చేసింది. ఐఎండీబీ జాబితాలో కృతి 4వ స్థానంలో నిలిచింది. అదే విధంగా పాకిస్థాన్ నుంచి కూడా ఓ నటి టాప్-10 మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ లిస్ట్‌లో చోటు సొంతం చేసుకుంది. ఆ జాబితాను పరిశీలిస్తే..
1. మెక్ కెన్నా గ్రేస్ - అమెరికా
2. జూలియా బటర్స్ - అమెరికా
3. హనియా అమీర్ - పాకిస్థాన్
4. కృతి సనన్ - ఇండియా
5. నాన్సీ మెక్ డోనీ - అమెరికా/దక్షిణ కొరియా
6. దిల్రాబా దిల్మురత్ - చైనా
7. షైలీన్ వుడ్లీ - అమెరికా
8. మార్గోట్ రాబీ - ఆస్ట్రేలియా
9. అనా డి అర్మాస్ - క్యూబా/స్పెయిన్
10. ఎమ్మా వాట్సన్ - యూకే
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు