
ఇది గమనిస్తే, జూనియర్ ఎన్టీఆర్ కాలర్ ఎగరేస్తే సినిమా హిట్టవుతుందనే సెంటిమెంట్ మరోసారి నిజమైందని చెప్పవచ్చు. ఈ పరిణామాలను బట్టి, వార్ 2 బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినట్లేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లు దీనిని మరింత బలపరుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో బుక్ అయినా టికెట్లను గమనించినా ఈ రెండు సినిమాల మధ్య 2 లక్షల టికెట్ల వ్యత్యాసం ఉంది.
అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వార్2 మూవీ మరింత పుంజుకోవాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమా ఫస్ట్ షో పూర్తి కాకముందే ఈ సినిమాకు కొంతమంది నెగిటివ్ రివ్యూస్ స్ప్రెడ్ చేశారు. అయితే ఈ సినిమా మాత్రం వేరే లెవెల్ లో ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తం కావడం గమనార్హం.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన డ్రాగన్ సినిమాపై భారీ అంచనాలతో ఈ సినిమా తెరకెక్కగా వచ్చే ఏడాది జూన్ నెలలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా ఏ స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది. డ్రాగన్ సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది, వార్2 ఫస్ట్ డే కలెక్షన్లు 86 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.