టాలీవుడ్లో విభిన్నమైన డైరెక్టర్ గా పేరు పొందిన డైరెక్టర్ తేజ గురించి చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎంతోమంది సినీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉండి హీరోగా తమ వారసులను ఎంట్రీ ఇవ్వాలని అంటే కచ్చితంగా డైరెక్టర్ తేజ తోనే ఇప్పించేందుకు చాలామంది సెలబ్రిటీలు సిద్ధం అయ్యేవారు. అలా ఎంతోమందిని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన తేజ తన కొడుకుకి డైరెక్టర్ గా పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం నుంచి మరొక వారసురాలని హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు తేజ.


ఈ చిత్రంలో ఘట్టమనేని రమేష్ బాబు కుమార్తె భారతి ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. రమేష్ బాబు కుటుంబం కూడా సినీ ఇండస్ట్రీకి బాగా పరిచయమే గతంలో రమేష్ బాబు కొడుకుని కూడా డైరెక్టర్ తేజనే ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. ఇప్పుడు రమేష్ బాబు కూతుర్ని కూడా తన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలిసి అభిమానులు ఆనందపడుతున్నారు. ఇప్పటికి ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటించలేదు. తేజ డైరెక్షన్లో తెరకెక్కించే సినిమా కొత్త హీరో హీరోయిన్స్ కి మంచి ఫ్లాట్ ఫామ్ గా మారుతుందని సినీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది.


సూపర్ స్టార్ మహేష్ బాబు పెద్ద కుమారుడు రమేష్ బాబు.. చిన్న కుమారుడు మహేష్ బాబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. రమేష్ బాబు, మహేష్ బాబుకి సోదరుడు. ముఖ్యంగా మహేష్ బాబు, రమేష్ బాబు మధ్య కూడా మంచి బాండింగ్ ఉండేది. రమేష్ బాబు అంటే మహేష్ బాబుకు చాలా అభిమానం ఉండేది. ఆయనతో కలిసి ముగ్గురు కొడుకులు, బజార్ రౌడీ వంటి చిత్రాలలో కూడా నటించారు మహేష్ బాబు. వీరిద్దరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారని ఎలాంటి సమస్య వచ్చినా కూడా వాటిని పరిష్కరించుకోవడానికి ఇద్దరు కూడా ఎక్కువగా చర్చలు జరిపే వారిని కానీ హీరోగా రమేష్ బాబు మాత్రం సక్సెస్ కాలేదు. నిర్మాతగా చేస్తున్న సమయంలో తన అన్నకు అండగా మహేష్ బాబు ఉండేవారు.. అయితే రమేష్ బాబు మరణ వార్త ఇప్పటికి మహేష్ బాబు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉంటుంది.మరి  రమేష్ బాబు కూతురు ఎంట్రీ ఈ విషయంపై మహేష్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: