గత కొద్ది రోజుల నుండి మంచు ఫ్యామిలీలో ఎన్ని వివాదాలు, గొడవలు చోటు చేసుకున్నయో చెప్పనక్కర్లేదు. ఒకరి మీద ఒకరు రాళ్లు రువ్వుకున్నట్లు చేస్తున్నారు. సొంత అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తున్నాయి.అయితే విష్ణు మనోజ్ కి ఆస్తి దక్కకుండా మొత్తం తానే తీసుకోవాలని చూస్తున్నట్టు బయట టాక్.కానీ మనోజ్ మాత్రం నాకు ఆస్తిపాస్తులు ఏమీ అవసరం లేదు.. విష్ణు విద్యాసంస్థల్లో చేసే అక్రమాలు అన్ని బయట పెట్టడానికే నేను ప్రయత్నిస్తున్నాను.కానీ ఈ ప్రయత్నంలో నన్ను నా భార్యపై కేసులు పెట్టి అనవసరమైనవన్నీ చేస్తున్నారు అంటూ  చెప్పిన సంగతి మనకు తెలిసిందే. అలా మోహన్ బాబు కూడా విష్ణు వైపు ఉండడంతో మనోజ్ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.. ముఖ్యంగా ఫ్యామిలీతో కలవడానికి కూడా వీల్లేకుండా అయిపోయింది. 

ప్రస్తుతం మనోజ్ తన భార్య పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే అసలు విష్ణు పేరు తలుచుకోవడానికి కూడా ఇష్టపడని మంచు మనోజ్ తాజాగా మంచు విష్ణు అన్నా అంటూ పోస్ట్ పెట్టడం సోషల్ మీడియాలో ఆశ్చర్యంగా మారింది. మరి ఇంతకీ అన్నతో గొడవలు పడుతున్న మనోజ్ ఎందుకు అలాంటి పోస్ట్ పెట్టారు.. ఇద్దరి మధ్య గొడవలు తొలగిపోయాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప మూవీ విడుదలై ఓ మోస్తరు టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో మంచు విష్ణు పిల్లలందరూ నటించారు.అలా మంచు విష్ణు చిన్నప్పటి పాత్రలో ఆయన కొడుకు అవ్రామ్ కూడా నటించాడు.అయితే తాజాగా జి ఫిలిం అవార్డ్స్ వేడుకల్లో మంచు విష్ణు కొడుకు అవ్రామ్ కి అవార్డు వచ్చింది. ఇక అవార్డు తీసుకోవడానికి తన తండ్రి తాతతో కలిసి స్టేజి మీదకి ఎక్కారు. 

ఇక దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది. అయితే అన్న కొడుకు గురించి మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. కంగ్రాట్స్ అవ్రామ్ నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది.. నువ్వు ఇండస్ట్రీలో ఇంతే సక్సెస్ఫుల్గా రాణించాలి. నాన్న మోహన్ బాబు గారితో అన్న మంచు విష్ణు తో కలిసి నువ్వు ఈ అవార్డు అందుకోవడం చాలా స్పెషల్ అంటూ చెప్పుకు రావడంతో ఈ విషయం కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఈ విషయం తెలిసిన చాలా మంది జనాలు ఇదేంటి ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలు సర్దుమనిగాయా.. మంచు విష్ణు అన్న అంటూ పోస్ట్ పెట్టడం ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఫైనల్ గా మీరు మీరు కలిసిపోయారా అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: