బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి కాస్త కాలమే అయినా.. స్టార్ క్రేజ్‌ ను సంపాదించుకున్న హీరోయిన్ శార్వారీ వాఘ్. రాజకీయ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన ఈ బ్యూటీ .. తాత మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి మనవరాలు కావడం విశేషం. తండ్రి విజయ్ వాఘ్ ముంబైలో ప్రసిద్ధ ఆర్కిటెక్ట్‌. తల్లి నమ్రతా కూడా ఆర్కిటెక్ట్‌. అలాగే సోదరి కూడా అదే రంగంలో ఉంటే.. కుటుంబంలో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఏకైక వ్యక్తి శార్వారీ వాఘ్ మాత్రమే. 2020లో కబీర్ ఖాన్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ది ఫర్గాటెన్ ఆర్మీతో తన కెరీర్ ప్రారంభించింది శార్వారీ. ఆ సిరీస్‌ మంచి సక్సెస్ సాధించి ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది.
 

2021లో బన్‌టి ఔర్ బబ్లీ 2లో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. తర్వాత ‘సోనియా బబ్లీ రావత్’, ‘ముంజ్యా’, ‘మహారాజ్’, ‘వేద’ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా ముంజ్యా సినిమా 100 కోట్ల క్లబ్‌లోకి చేరి ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ ఇప్పటికీ ఆ ఒక్క పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ మాత్రం ఆమె కెరీర్‌లో రాలేదు. 28 ఏళ్ల వయసులోనే కోట్ల ఆస్తులకు వారసురాలిగా ఉన్న శార్వారీ .. ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్టెస్ట్ యంగ్ హీరోయిన్‌గా గుర్తింపు పొందుతోంది. గ్లామర్‌తో పాటు నటనలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. నైకా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆమె .. ఒక్కో యాడ్‌కి లక్షల రూపాయల పారితోషికం అందుకుంటోంది.

 

నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు ప్రస్తుతం రూ.1.50 కోట్లకు పైగా ఉంటే .. ఒక్కో సినిమాకు రూ.50 లక్షల వరకు రేమ్యునరేషన్ అందుకుంటోంది. ఇక సినిమాల్లో నటించకముందే శార్వారీ .. అసిస్టెంట్ డైరెక్టర్‌గా బాలీవుడ్‌లో పలు ప్రాజెక్టుల్లో పని చేసింది. అదే సమయంలో నటనపై ఆసక్తితో అవకాశాలు వెతికి.. ఆ తర్వాత హీరోయిన్‌గా మారింది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తరచూ హాట్ ఫోటో షూట్స్‌తో యువతకు నిద్రలేకుండా చేస్తుంది. మొత్తం మీద .. రాజకీయ కుటుంబం నుంచి వచ్చి కూడా సినీ రంగంలో తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న హీరోయిన్ శార్వారీ వాఘ్. గ్లామర్, టాలెంట్ రెండూ కలిపి ఉన్న ఈ బ్యూటీకి త్వరలోనే బిగ్ బ్రేక్ తప్పదని ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం లైన్లో ఉన్న పలు క్రేజీ ప్రాజెక్టులతో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి రెడీ అవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: