“ఎక్కడ తగ్గాలో… ఎక్కడ నెగ్గాలో” – ఈ డైలాగ్ పవన్ కల్యాణ్ సినిమా నుంచే పాపులర్ అయినా, ఆయన జీవితానికి అద్దం పడిన వాక్యం ఇది. నిజ జీవితంలోనూ, రాజకీయ రంగంలోనూ పవన్ అదే తత్త్వాన్ని అనుసరించారు. బలం ఉన్నంత మాత్రాన ఎప్పుడూ గెలుపు అనుకోవడం కాదు… ఒక్కోసారి తగ్గడమే గొప్ప విజయం. ఆ మార్గంలో నడిచి నేడు డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు.


సినీ రంగంలో పవర్ స్టార్ :
చిరంజీవి తమ్ముడిగా సినీ రంగంలోకి వచ్చిన పవన్ కల్యాణ్, మొదటి సినిమా ఫెయిల్ అయినా, తన స్టైల్‌, తన యూనిక్‌ పర్సనాలిటీతో యూత్‌ను ఆకట్టుకున్నారు. సినిమాలు ఎలా ఉండాలో, యువత ఏమి కోరుకుంటారో అధ్యయనం చేసి, వాటిని తన కథల్లో ప్రతిబింబింపజేశారు. ఫలితంగా యూత్ ఐకాన్‌గా, తర్వాత పవర్ స్టార్‌గా ఎదిగారు. పరిచయం మాత్రమే కాదు… తన టాలెంట్, తన స్వయంశక్తితో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు.



రాజకీయ రంగంలో పవర్ :
ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్ అయినా వెనుకడుగు వేయలేదు. జనసేన పార్టీ స్థాపించి, ఎన్నో అవరోధాలు, ఎదురు దెబ్బలు ఎదుర్కొని, చివరికి ఎన్డీఏలో భాగస్వామ్యంతో అద్భుత విజయాలు సాధించారు. 100% పోటీ సీట్లలో గెలవడం సాధ్యం కాకపోయినా, సాధించిన ఫలితం మాత్రం ఆయన నాయకత్వ శక్తిని చూపించింది. నేడు ఆయనను రాజకీయ పవర్ స్టార్ అని పిలవడానికి కారణమే అదే.



ప్రజాసేవే పవన్ టార్గెట్ :
రాజకీయాల్లో చాలామందికి డబ్బు సమస్య ఉండదు. కానీ పవన్ మాత్రం స్వయంగా సంపాదించి, తన సొమ్మును ప్రజల కోసం ఖర్చు చేస్తారు. అధికారాన్ని సంపద కోసం కాకుండా ప్రజాసేవ కోసం ఉపయోగించాలనే తపన ఆయనదే ప్రత్యేకత. దాడులు, విమర్శలు ఎదురైనా, స్వార్థం లేని రాజకీయాల పంథా పవన్ కల్యాణ్‌ది ప్రత్యేకం. హ్యాపీ బర్త్‌డే డిప్యూటీ సీఎం & పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు! సినీ రంగంలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పవన్ … రాజకీయ రంగంలోనూ శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు.

ఇండియాలో పవర్ స్టార్ – పొలిటిక్స్‌లో పవర్ లీడర్

మరింత సమాచారం తెలుసుకోండి: