మలయాళంలో స్టార్ హీరోగా పేరు సంపాదించిన దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. ఓకే బంగారం, సీతారామం, కింగ్ ఆఫ్ కోత, లక్కీ భాస్కర్ తదితర చిత్రాలలో నటించారు. మమ్ముట్టి కొడుకు అయినప్పటికీ కూడా తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈమధ్య మలయాళ ఇండస్ట్రీతో పాటుగా తెలుగులో కూడా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా దుల్కర్ సల్మాన్ ఒక హీరోయిన్ పైన చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఒక హీరోయిన్ నా చెల్లెలు అంటూ కితాబ్ ఇచ్చారు దుల్కర్ సల్మాన్.



హీరోయిన్ ఎవరో కాదు మలయాళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్. అఖిల్ నటించిన హలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రెండు మూడు చిత్రాలలో నటించింది. తెలుగులో పెద్దగా క్రేజీ సంపాదించుకోలేకపోవడంతో మలయాళ ఇండస్ట్రీలోనే పలు సినిమాలలో నటిస్తోంది. ఇటీవలే" కొత్త లోక" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ డోమినిక్ అరుణ్ డైరెక్షన్లో  ఈ సినిమా రాగ దుల్కర్ సల్మాన్ తన బ్యానర్ పైన ఈ సినిమాని తెరకెక్కించారు.



మలయాళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా మొదటి రోజే రూ.2.7 కోట్ల రూపాయల ఓపెనింగ్ ని రాబట్టింది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా సక్సెస్ మీట్ కి దుల్కర్ సల్మాన్ గెస్ట్ గా వచ్చారు. ఇందులో మాట్లాడుతూ హీరోయిన్ ప్రియదర్శిని తనకు చెల్లెలు లాంటిదని.. ఇద్దరి ఆలోచనలు కూడా సిమిలర్ గానే ఉంటాయి. నాకు తెలిసి మీమిద్దరం గత జన్మలో కవలపిల్లలమైయుంటాము అంటూ తెలిపారు దుల్కర్ సల్మాన్. దుల్కర్ సల్మాన్ చేసిన ఈ కామెంట్స్ సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: