ఇండస్ట్రీలో ఇప్పుడు పూర్తిగా ట్రెండ్ మారిపోతోంది. పాత పద్ధతులకు గుడ్‌బై చెప్పి, కొత్త తరహా ప్రయోగాలకు నాంది పలుకుతున్నారు సినీ స్టార్స్. ముఖ్యంగా స్టార్ హీరోల పొజిషన్‌లు, వారి ఇమేజ్‌లు కూడా వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు హీరోలు కేవలం హీరో పాత్రలకే పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు అలాంటి లిమిటేషన్స్ లేకుండా, హీరోలు విలన్ పాత్రల్లోనూ నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. “హీరో అంటే హీరోగానే ఉంటాడు” అనే పాత నమ్మకాన్ని వదిలి, విభిన్నమైన పాత్రలను స్వీకరించి తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.


సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇండస్ట్రీ గురించి ఒక ఆసక్తికరమైన చర్చ ట్రెండ్ అవుతోంది. తెలుగు సినీ రంగంలో మెగాస్టార్ అనే పదం ఒక్కరినే సూచిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి.. ఆయన తర్వాత అలాంటి స్థానం దక్కించుకోవాలంటే అసాధారణమైన గట్స్, కష్టపడే తత్వం, అభిమానులను ఆకట్టుకునే లుక్స్ ఉండాలి అని అందరూ చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఆ స్థాయి కష్టపడి ఆ స్థాయికి చేరుకోవడం చాలా కష్టమని చాలా
 మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ తరువాత స్థాయిలో పాపులారిటీని, మాస్ క్రేజ్‌ను సంపాదించుకున్న ఏకైక స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పవచ్చు.
 

పవన్ కళ్యాణ్‌కు “పవర్ స్టార్” అనే ట్యాగ్ అతని ప్రత్యేక వ్యక్తిత్వానికి ప్రతీక. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌కి, మాట తీరు కి అభిమానులు ఉప్పొంగిపోతారు. పవన్ కళ్యాణ్‌ తరువాత ఈ ప్రత్యేకమైన  పవర్ స్టార్ ఇమేజ్ తఎవరికీ దక్కుతుందా అనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో అభిమానులు ఈ చర్చలో బాగా పాల్గొంటున్నారు. కొంతమంది నెటిజన్లు పవర్ స్టార్ ట్యాగ్ పవన్ కళ్యాణ్ తర్వాత అఖీరానందన్కే కే పర్ఫెక్ట్‌గా సరిపోతుందని అంటున్నారు. వారి అభిప్రాయం ప్రకారం అఖీరానందన్‌లో మాస్ అప్పీల్, డేర్ అండ్ డాషింగ్ పర్సనాలిటీ కనిపిస్తోందని అంటున్నారు. కానీ మరికొంతమంది మాత్రం ఇప్పుడే ఆయనకు పవర్ స్టార్ అనే ట్యాగ్ ఇవ్వడం కొంచెం త్వరపడినట్లే అవుతుందని అంటున్నారు. అలాంటి స్థాయికి చేరుకోవాలంటే అనుభవం, క్రేజ్, నిరంతర విజయాలు కావాలని అభిప్రాయపడుతున్నారు.



ఇక మరోవైపు, కొంతమంది నెటిజన్లు పవన్ కళ్యాణ్ తర్వాత పవర్ స్టార్ ఇమేజ్ విజయ్ దేవరకొండకే బాగా సూటవుతుందని చెబుతున్నారు. ఆయన ధైర్యంగా మాట్లాడే తీరు.. ప్రజలతో డైరెక్ట్ కనెక్ట్ అవగలిగే నైపుణ్యం, యూత్‌లో ఉన్న పాపులారిటీ వంటివి ఈ ట్యాగ్‌కు ఆయనను సరైన వ్యక్తిగా నిలబెడతాయని వారు అంటున్నారు. ప్రస్తుతం ఈ చర్చ సోషల్ మీడియాలో వేడెక్కింది. మరి మీ అభిప్రాయం ఏమిటి? పవన్ కళ్యాణ్ తర్వాత పవర్ స్టార్ అనే ట్యాగ్ అఖీరానందన్కి బాగా సూటవుతుందా? లేక విజయ్ దేవరకొండకే సరిగ్గా సరిపోతుందా? మీ ఆన్సర్స్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: