
ప్యారడైజ్ సినిమా కథ 80వ దశకంలో సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్లో ఉండేలా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నాని కూడా రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నట్లు వినికిడి. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం నిర్మాతలు హైదరాబాద్ శివారు ప్రాంతంలో సుమారుగా 30 ఎకరాల విస్తీర్ణంలో ఒక మురికివాడ సెట్ నిర్మించినారని వినిపిస్తోంది. ఇందులో చిత్రీకరించే సన్నివేశాలు సినిమా అంతటికి హైలెట్ అయ్యేలా ఉంటుందని చిత్ర బృందం భావిస్తోంది. ది పారడైజ్ చిత్రంలో నాని రెండు పొడవాటి జడలు వేసుకుని చాలా రగ్గడ్ లుక్ లో ఒక పాత్ర మరొక పాత్ర చాలా భిన్నంగా ఉంటుందట.
ది ప్యారడైజ్ సినిమా సుమారుగా రూ.100 కోట్లకు పైగా తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నారు సంగీతాన్ని అనిరుధ్ అందించడం సినిమాకి బాగా కలిసొస్తోంది. సుమారుగా 8 భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు వచ్చే ఏడాది మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.ఒకవైపు హీరోగా చేస్తూనే మరొకవైపు నిర్మాతగా కూడా పలు చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. హీరోగా నాని ప్రతి సినిమాలో కూడా తన కథను సరికొత్త వేరియేషన్ లో కనిపిస్తున్నారు. చివరిగా ఈ ఏడాది HIT 3 తో మంచి విజయాన్ని అందుకున్నారు.