తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు.. ఇందులో కొంతమంది సినీ బ్యాక్ గ్రౌండ్ ఉండి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మరి కొంతమంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చారు.. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది  విజయ్ దేవరకొండ.. ముందుగా చిన్నచిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్నారు. అయితే విజయ్ దేవరకొండకు అంతగా పేరు తీసుకువచ్చిన సినిమా అర్జున్ రెడ్డి.. చిన్న చిత్రంగా వచ్చినటువంటి ఈ మూవీ అతిపెద్ద హిట్ సాధించి  విజయ్ దేవరకొండని రౌడీ హీరోని చేసింది. తర్వాత గీత గోవిందం,  డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

 అలాంటి విజయ్ దేవరకొండ షూటింగ్ గీతా గోవిందం సినిమా చేస్తున్న సమయంలోనే నేషనల్ క్రష్ రష్మిక మందాన్న తో ప్రేమలో పడ్డారట. వీరి ప్రేమ వ్యవహారం దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. అంతే కాదు ఇద్దరు కలిసి పలు వెకేషన్స్ కి కూడా వెళ్లిన ఫోటోలు బయటకు వచ్చాయి. కానీ వీరిని మీడియా ప్రశ్నించినప్పుడు మేము జస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఇద్దరు కలిసి ఒకరి సినిమాకు మరొకరు ప్రమోషన్స్ చేసుకోవడం వంటివి చూశాం. అయినా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఎప్పుడు ఒప్పుకోలేదు..

అయితే తాజాగా విజయ్ దేవరకొండ రష్మిక మందాన్న సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ సీక్రెట్ గా అత్యంత దగ్గరి కుటుంబ సభ్యుల మధ్య  ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు సమాచారం..అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరగబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎక్కడా బయటకు రాలేదు కానీ వీరిద్దరూ ఎంగేజ్మెంట్ ద్వారా ఒక్కటి కాబోతున్నట్టు మాత్రం తెలుస్తోంది.. ప్రస్తుతం దీనికి సంబంధించిన మ్యాటర్ సోషల్ మీడియా, మెయిన్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది  విషెస్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: