
ఈ షెడ్యూల్ కోసం కాశీ క్షేత్రాన్ని ప్రతిబింబించే విధంగా అత్యంత ఖర్చుతో కూడిన భారీ సెట్‌ను నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సెట్ నిర్మాణం కోసం దాదాపు రూ.57 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని ఫిలిం సర్కిల్స్‌లో టాక్. రాజమౌళి కెరీర్‌లో ఇంత పెద్ద బడ్జెట్‌తో ఓ సెట్ రూపొందించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సెట్‌లో సినిమా కథలో కీలకంగా నిలిచే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అంతేకాకుండా సినిమాలో నటించబోయే దాదాపు మొత్తం తారాగణం కూడా ఈ భారీ సెట్‌లో జరిగే షూటింగ్‌లో పాల్గొనబోతోందని సమాచారం.
రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా కథ గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, “నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్‌కు పెద్ద అభిమానులం. ఆయన పుస్తకాల ప్రభావంతోనే ఈ సినిమా కథను రాసాము” అని వెల్లడించారు. విల్బర్ స్మిత్ పుస్తకాలలో ఉండే అడ్వెంచర్, హిస్టరీ, యాక్షన్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో కూడా ప్రధానంగా ఉండబోతున్నాయన్న అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమా కోసం రాజమౌళి ఇంత భారీ బడ్జెట్‌ను వెచ్చించడం, కేవలం భారతీయ ప్రేక్షకులను మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులను లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీలు, అంతర్జాతీయ టెక్నీషియన్స్‌తో చర్చలు జరుపుతున్నారట. ఈ సినిమా నిజంగా గ్లోబల్ లెవెల్‌లో తెలుగు సినిమా ప్రతిష్టను మరింత పెంచబోతుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ సినిమా అప్‌డేట్స్ ఒక్కోటి బయటకొస్తున్న కొద్దీ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపవుతోంది. “బాహుబలి”, “ఆర్ఆర్ఆర్” వంటి సినిమాల ద్వారా తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి, ఈ సినిమాతో మరో లెవెల్ స్టాండర్డ్ సెట్ చేయబోతున్నారని సినీప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్‌లో కూడా ఈ సినిమా మైలురాయిగా నిలుస్తుందన్న అంచనాలు మొదలయ్యాయి.