బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన లేటెస్ట్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌ `కిష్కింధ‌పురి`. కౌశిక్‌ పెగళ్లపాటి డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రం గ‌త వారం `మిరాయ్‌` వంటి పాన్ ఇండియా ఫిల్మ్ తో పోటీ ప‌డుతూ బ‌రిలోకి దిగింది. మెజారిటీ ఆడియెన్స్ సినిమా బాగుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. న‌టీన‌టుల పెర్ఫార్మెన్స్, హారర్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ సన్నివేశాలు, ప‌తాక స‌న్నివేశాల్లో వ‌చ్చే ట్విస్ట్‌లు సినిమాకు ప్ర‌ధానంగా బ‌లంగా నిలిచాయి.


టాక్ పాజిటివ్ గా ఉండ‌టంతో కిష్కింధ‌పురి డీసెంట్ ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ ర‌న్ ను ప్రారంభించింది. రెండో రోజు నుంచి క‌లెక్ష‌న్స్ మ‌రింత ఊపందుకున్నాయి. థియేట‌ర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు ప‌డుతున్నాయి. ఓవైపు మిరాయ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా నుంచి
వ‌స్తున్న‌ పోటీని త‌ట్టుకుని కిష్కింధ‌పురి నిల‌బ‌డిందంటే కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ సోలో రిలీజ్ ద‌క్కుంటే ఈ చిత్రం బాక్సాఫీస్‌ను దున్నేసేది.


ఇదిలా ఉంటే..కిష్కింధ‌పురికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట స‌ర్క్యులేట్ అవుతుంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ సినిమాకి ఫ‌స్ట్ ఛాయిస్ బెల్లంకొండ కాదట‌. డైరెక్ట‌ర్ కౌశిక్‌ మొద‌ట ఈ చిత్రాన్ని మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ తో చేయాల‌ని భావించాడ‌ట‌. స్టోరీ నెరేష‌న్ కూడా ఇవ్వ‌డం జ‌రిగింది. కానీ అప్ప‌టికే కొన్ని ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండ‌టంతో తేజ్ సున్నితంగా తిర‌స్క‌రించారు. ఆ త‌ర్వాత నిఖిల్ ను సంప్ర‌దించ‌గా.. ఆయ‌న స్టోరీకి బాగా ఇంప్రెస్ అయ్యార‌ట‌. బ‌ట్ డేట్స్ స‌ర్దుబాటు చేయ‌లేక నిఖిల్ సైతం నో చెప్పాడు. ఫైన‌ల్‌గా కిష్కింధ‌పురి బెల్లంకొండ ఖాతాలో ప‌డింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: