మెగాస్టార్ చిరంజీవి హీరో గా నయనతార హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం మన శంకర వర ప్రసాద్ అనే సినిమా రూపొందుతున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే కొంత కాలం క్రితం చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఓ చిన్న గ్లిమ్స్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక చిరంజీవి హీరోగా నటిస్తున్న మూవీ కావడం ఇప్పటివరకు అపజయం అంటూ ఎరగని దర్శకుడు అయినటువంటి అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ప్రస్తుతానికి భారీ అంచనాలు ఉన్నాయి.

అనిల్ రావిపూడి ఆఖరుగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు బీమ్స్ సిసిరిలీయో సంగీతం అందించాడు. ఈ మూవీ లోని సాంగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇక ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న మన శంకర వర ప్రసాద్ సినిమాకు కూడా బీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. దానితో సంక్రాంతికి వస్తున్నాం సినిమా రేంజ్ మ్యూజిక్ ను ఈ సినిమాకు కూడా బీమ్స్ ఇస్తాడు అని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.  

మూవీ కి సంబంధించిన మొదటి సాంగ్ ను అక్టోబర్ ఒకటవ వారంలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలబడనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా రేంజ్ మ్యూజిక్ ను బీమ్స్ ఈ సినిమాకు ఇచ్చిన్నట్లయితే ఈ మూవీ మొదటి సాంగ్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: