ప్రస్తుతం తెలుగు సినిమా వర్గాల్లో, మీడియా సర్కిల్స్‌లో హీరో ప్రభాస్ పేరు మళ్లీ మళ్లీ వినిపిస్తోంది. ఆయన చేసే ప్రతి కదలిక, ప్రతి నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్ మాత్రమే కాకుండా మొత్తం భారత సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతోంది. రీసెంట్‌గా ప్రభాస్ తన మంచి మనసుని, తన ఫ్రెండ్స్‌కి ఉన్న లాయల్టీని మళ్లీ ఒకసారి ప్రూవ్ చేశాడు. ముందుగా కన్నప్ప సినిమాని తీసుకుంటే.. ఆ సినిమా మొత్తానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది ప్రభాస్ గెస్ట్ అపీరియన్స్. విష్ణు ప్రధాన పాత్రలో నటించినప్పటికీ, ప్రభాస్ స్క్రీన్‌పై కనిపించిన కొన్ని నిమిషాలే థియేటర్లలో హౌస్‌ఫుల్ కేరింతలు వినిపించాయి. ప్రభాస్ చేసిన క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో, చూసిన ప్రతి ఒక్కరూ “కన్నప్పలో హీరో విష్ణుకంటే కూడా ప్రభాస్ ఇంపాక్ట్ ఎక్కువైంది” అని చెప్పకుండా ఉండలేకపోయారు.


అదే విధంగా మిరాయి సినిమా విషయంలో కూడా ఆయన తన వంతు సహాయం చేశాడు.  తన గాత్రాన్ని ఇచ్చి సినిమా రేంజ్‌ని డబుల్ చేశారు. దీంతో మిరాయి టీమ్ ఆనందపడటమే కాకుండా, ఆ మూవీకి భారీగా హైప్ రావడానికి కారణమయ్యాడు. ఇక ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ ఏమిటంటే, కన్నప్ప, మిరాయి తర్వాత ప్రభాస్ తన గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోయే నెక్స్ట్ మూవీ ఏది..? అన్న ప్రశ్న. సోషల్ మీడియాలో వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం, ప్రభాస్ కనిపించబోయే సినిమా మరెవరిది కాదు, అల్లు అర్జున్అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ.



ఇప్పటికే అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అట్లీ తన సినిమాల్లో మల్టీస్టారర్ ట్రీట్‌ ఇవ్వడంలో, గెస్ట్ అపీరియన్స్‌లతో సినిమాని హైలైట్ చేయడంలో మాస్టర్ అని అందరికీ తెలుసు. ఈసారి కూడా ఆయన అదే ట్రిక్ వాడుతున్నాడట. వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో దాదాపు పది మంది స్టార్ హీరోలు స్పెషల్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతున్నారని న్యూస్ వినిపిస్తోంది. అందులో ప్రభాస్ పేరు ఉండటం ఫ్యాన్స్‌కి పండుగలా మారింది. నిజంగా డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమాలో చిన్న రోల్‌లో కనబడితేనే, సినిమా క్రేజ్ ఇంకో లెవెల్‌కి వెళ్లిపోతుందనే చెప్పొచ్చు. అల్లు అర్జున్అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి, ప్రభాస్ చేరడం అంటే ఫ్యాన్స్ మాత్రమే కాదు, ట్రేడ్ సర్కిల్స్ కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాయి.



ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్న ప్రశ్న ఒక్కటే – “ప్రభాస్ నిజంగా ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయనున్నాడా..? లేక సోషల్ మీడియాలో వస్తున్న వార్తలేనా..?” . కానీ ఒకవేళ ఇది నిజమైతే మాత్రం, ప్రభాస్ ఫ్యాన్స్‌కి, బన్నీ ఫ్యాన్స్‌కి ఇది డబుల్ ట్రీట్ కాబోతోందని చెప్పడంలో సందేహమే లేదు. మొత్తానికి, కన్నప్ప – మిరాయి తర్వాత డార్లింగ్ ప్రభాస్ చేసే ఈ కొత్త గెస్ట్ అపీరియన్స్ ప్రాజెక్ట్ ఇండస్ట్రీలోనే కాదు, పాన్ ఇండియా లెవెల్‌లో సెన్సేషన్ అవుతుందని ఇప్పటికే టాక్ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: