రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ నటించిన కాంతార తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవల్లో ఎంత పెద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వల్‌గా రూపొందించబడుతున్న కాంతార చాప్టర్ వన్ సినిమా మీద అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండగా, ఆ అంచనాలను మరింత పెంచేలా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయబోతోంది సినిమా టీమ్. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కన్నడ సినిమాగా రూపొందించబడిన ఈ సినిమాని ప్యాన్ ఇండియా లెవెల్‌లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క భాషలో ఒక్కొక్క స్టార్ హీరోతో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయించబోతున్నారు.


ఇప్పటికే టీమ్ అనౌన్స్ చేసిన దాని ప్రకారం తెలుగులో ఈ సినిమా ట్రైలర్‌ని డార్లింగ్ ప్రభాస్ లాంచ్ చేయబోతుండగా, హిందీలో బాలీవుడ్ ఐకాన్ హృతిక్ రోషన్, మలయాళంలో అక్కడి స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, తమిళంలో అక్కడి స్టార్ హీరో శివ కార్తికేయన్ తమ సోషల్ మీడియా అకౌంట్స్‌ల వేదికగా ఈ సినిమా ట్రైలర్‌ని సోమవారం అంటే సెప్టెంబర్ 22, 12 గంటల 45 నిమిషాలకు లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటికే సూపర్ హిట్‌లు అందించిన హోంబాలే ప్రొడక్షన్స్ నుంచి రాబోతున్న ఈ సినిమా కేవలం హోంబాలే సినిమాకే కాదు, కన్నడ సినీ పరిశ్రమకు మరో బ్లాక్ బస్టర్ సినిమాగా ఇప్పటికే దాదాపుగా ఖరారు అయిపోయింది. 1000 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యే తదుపరి కన్నడ సినిమాగా ఈ సినిమా రంగంలోకి దిగుతుంది. రిషబ్ శెట్టి ఓ పక్క డైరెక్ట్ చేస్తూ మరోపక్క హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నాడు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: