
స్టేజ్‌పైకి వచ్చిన పవన్ కళ్Yఆన్ సినిమా కోసం ఎంత కష్టపడ్డారు..? సినిమా కాన్సెప్ట్ ఏంటి..? ప్రేక్షకులు ఎందుకు చూడాలి..? సినిమా కోసం చేసిన ప్రత్యేక ప్రయత్నాల గురించి టోటల్ స్పష్టంగా వివరించారు. ఆయన ప్రత్యేకంగా మరి “ఈ సినిమాకు పిచ్చెక్కిపోయేలా పని చేసిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు” అని తెలిపారు. ఆ ఇద్దరు ఎవరో అంటే, డైరెక్టర్ సుజిత్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. పవన్ కళ్యాణ్.. వీరు ఓజీ సినిమా కోసం చేసిన కృషి తనపై ఎంత ప్రభావం చూపిందో అంగీకరించారు. ఈ కామెంట్స్ తరువాత, సోషల్ మీడియాలో సుజిత్ మరియు తమన్ పేర్లు పై చర్చ జోరుగా పెరుగుతోంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌కు చాలా దగ్గరగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావును మర్చిపోయిన స్థాయిలో, సుజిత్-తమన్ తమ ఫైనల్ స్థాయికి పవన్ కళ్యాణ్ దగ్గర చేరారు అనే అభిప్రాయాన్ని ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా పవన్ కళ్యాణ్ పేరును బాక్సాఫీస్‌లో ఎంత హై స్థాయికి తీసుకెళ్తుందో అంటూ ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో నటీనటులు శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, వై. రవిశంకర్, కోన వెంకట్ తదితరులు పాల్గొని సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.