ఎస్ ప్రెసెంట్.. ఈ న్యూస్  తెలుగు ఫిలిం సర్కిల్స్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. మనందరికీ తెలిసిందే, సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ బిగ్ ప్రాజెక్ట్ ‘ఓజీ’ కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయి, సూపర్ డూపర్ హిట్ సాధించింది. ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమా గా ఇది సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమా చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, నాన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా “పవన్ కళ్యాణ్‌ను ఈ రేంజ్‌లో చూడడం నిజంగా హ్యాపీగా ఉంది” అని, ‘బ్యాక్ టు పవన్ కళ్యాణ్’, ‘బాస్ ఇజ్ బ్యాక్’ అంటూ రకరకాలుగా ప్రశంసిస్తున్నారు.


అదే సమయంలో, సినిమాకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్సినిమా కోసం సుజిత్ కి ఒకే ఒక్క కండిషన్ పెట్టాడట. అది ఏమిటంటే, “సినిమా కి ఎంత టైం అయినా తీసుకో.. ఫైనల్ రిజల్ట్ అభిమానులను పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయాలి. (నా) పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పూనకాలు తెప్పించాలి. సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఉండడం గర్వకారణంగా ఫీల్ అయ్యేలా ఉండాలి” అని చెప్పారట. ఆ కారణంగానే, షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యం అయినా ఎక్కడ టెన్షన్ పడకుండా సుజిత్ చక్కగా ముందుకు వెళ్ళారట.  పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ, కమిట్మెంట్‌తో ఆయన షూటింగ్‌ను పూర్తిగా నిర్వర్తించారు. ఒక్కొక్క సీన్ థియేటర్లో చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి.



మరింత ముఖ్యంగా, సినిమాకు ప్లస్ పాయింట్గా తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పాలి. సువ్వి సువ్వి సాంగ్ రిలీజ్ టైమ్‌లో తమన్ మ్యూజిక్ ని ట్రోల్ చేశారు జనాలు. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. థియేటర్లో చూసినప్పుడు ఈ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఎక్స్పీరియన్స్‌ను పూర్తిగా ఇచ్చింది అని ఫ్యాన్స్ చెబుతున్నారు. మొత్తానికి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ‘ఓజీ’ ఒక జీవితం లో వాస్తవ సంతృప్తిని ఇచ్చిన సినిమా. ఇప్పుడు, సుజిత్ నెక్స్ట్ ఏ హీరోను డైరెక్ట్ చేయబోతున్నాడో అనే విషయం కూడా బిగ్ హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: