కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటించి కాంతారా అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమా మూడు సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా కాంతారా చాప్టర్ 1 అనే సినిమాను రూపొందించారు. ఈ మూవీ ఈ రోజు అనగా అక్టోబర్ 2 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషలలో విడుదల అయింది. కాంతారా సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించడంతో కాంతారా చాప్టర్ 1 మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను చాలా ప్రాంతాలలో ప్రదర్శించారు. ఈ మూవీ ప్రీమియర్ షో లకు మంచి టాక్ ప్రేక్షకుల నుండి లభించింది. కాంతారా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దానితో కాంతారా చాప్టర్ 1 మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ..? ఈ మూవీ ఎన్ని కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది అనే వివరాలకు తెలుసుకుందాం.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు నైజాం ఏరియాలో 40 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఆంధ్ర ఏరియాలో 40 కోట్లు ,  సీడెడ్ లో 10 కోట్ల స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 90 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి హిట్ టాక్ వచ్చినా కూడా చాలా రోజులు మంచి కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేస్తేనే ఈ మూవీ హిట్ స్టేటస్ను అందుకొని మంచి లాభాలను అందుకుంటుంది అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: