నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో కొంత కాలం క్రితం వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ 2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ అంచనాల నడుమ విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా మంచి కలెక్షన్లను వసూలు చేసి ఆ సమయంలో బాక్సా ఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక ఈ మూవీ తర్వాత బాలకృష్ణ మరోసారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి అని ఆ తర్వాత అనేక వార్తలు వచ్చాయి. కొంత కాలం క్రితమే బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబో మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య , గోపీచంద్ మలినేని కాంబో మూవీ ని అక్టోబర్ 24 వ తేదీన గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం గోపీచంద్ మలినేని కాంతారా మూవీ టెక్నీషియన్ ను రంగం లోకి దించబోతున్నట్లు తెలుస్తోంది.

కాంతారా మరియు కాంతారా చాప్టర్ 1 సినిమాలకు సినిమాటో గ్రాఫర్ గా పని చేసిన అర్వింద్ ఎస్ కాశ్యప్ ను బాలకృష్ణ సినిమాకు సినిమాటో గ్రాఫర్ గా గోపీచంద్ మలినేని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ మంచి విజయం సాధించడంతో వీరి కాంబినేషన్లో రాబోయే రెండవ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ , బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: