
ఇక తాజాగా రవితేజ మరియు శ్రీ లీలా భాను భాగవరపూ సుమాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు . ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా మాస్ జాతర సాంగ్ పైట్రోల్స్ చేస్తున్న ప్రేక్షకులకు రవితేజ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు . అసలు విషయానికి వస్తే .. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ఓలే ఓలే సాంగ్ బాగానే మార్కులు కొట్టేసి యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతుంది . ఇది ఎంతగా పాపులర్ అయిందో అంటే స్థాయిలో విమర్శలు మరియు ట్రోల్స్ కి కూడా గురైందని చెప్పుకోవచ్చు . ఇందులో " నీ అమ్మ నీ అయ్యా మరియు నీ అక్క , నీ చెల్లి గుంట నీ ఒళ్ళు కొచ్చి పంట , సిగ్గు లేదు, శరము లేదు , లాగూ లేదు " అనే పదాలు చర్చనీయాంశమయ్యాయి .
చాలామంది అసభ్యంగా ఉందంటూ రోల్స్ చేస్తున్నారు . జానపద స్టైల్ పేరుతో పాటలను పాడు చేస్తున్నారని మండిపడడం జరిగింది . ఈ క్రమంలోనే మాస్ మహారాజ్ ఈ విషయంపై స్పందిస్తూ .. " పాటల లోని కొన్ని లైన్స్ మాత్రమే విని కొందరు విమర్శలు చేయడం జరిగింది . కానీ ఆ పాట అర్థం తెలియాలంటే సినిమా చూస్తేనే అర్థమవుతుంది . కనుక ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదు . మొత్తం వినండి. ఈ పాటను కదా డిమాండ్ ను బట్టి పెట్టారు " అంటూ మాస్ మహారాజ్ మండిపడ్డాడు . ప్రజెంట్ రవితేజ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.