
ప్రియదర్శి మాట్లాడుతూ .. " నిజానికి నాకు ఇంతకుముందు ఇలా ఎప్పుడూ జరగలేదు . అది కూడా ఒకే ఐపి అడ్రస్ నుంచి 300 ఐడీలతో కామెంట్స్ పెట్టించారు . ఇది ఎవరు చేస్తున్నారో ఏంటో నాకు అర్థం కావడం లేదు . దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావడం లేదు . అయితే ఒకటి మాత్రం చెప్పగలను . ఇప్పటికే దీని మీద సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశాం . చట్టం తన పని తాను చేసుకుంటుంది . ఏదేమైనా ఇలా టార్గెట్ చేసింది నెగటివ్ కామెంట్స్ పెట్టడం తప్పు . ఏదైనా నేను తప్పు చేస్తే నన్ను విమర్శించవచ్చు . కానీ ఇలా చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది .
నా సినిమా అని ఇలా చేస్తున్నారా లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయో నాకు అర్థం కావడం లేదు " అంటూ కామెంట్స్ చేశాడు ప్రియదర్శి . ఏదేమైనా ఈ కామెంట్స్ వల్ల సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమోనని ప్రియదర్శి కంగారుగానే ఉన్నాడని చెప్పుకోవచ్చు . మరి ఈ సినిమా రిలీజ్ అనంతరం ట్రోలింగ్ చేస్తున్న వారికి నోరు మూసే విధంగా కలెక్షన్స్ తో సమాధానం చెబుతుందో లేక వారి ట్రోల్స్ ని నిజం చేస్తుందో చూడాలి .