
శోభా డే మాట్లాడుతూ.. ముంబై కి సంబంధించి కొన్ని విషయాలు తనని ఆశ్చర్యపరిచాయని ఈ నగరంలో ఒక రెస్టారెంట్ రాత్రికి రాత్రి రూ.2 నుంచి రూ .3 కోట్ల రూపాయల వరకు టర్నోవర్ అవుతోంది(అంటే నెలకు సుమారుగా 40 నుంచి 50 కోట్లు) అంటూ తెలిపారు. అయితే మొదట విన్నప్పుడు ఇది నిజం కాదేమో అనుకున్నాను, కానీ ఆ నెంబర్లు గురించి స్వయంగా విన్నానని తెలిపారు. ఆ రెస్టారెంట్ శిల్పా శెట్టి బాస్టియన్ అంటూ తెలిపారు శోభా డే. ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్లి చూసి షాక్కు గురయ్యాను. అక్కడ 1400 మంది అతిథులు అక్కడ స్టే చేయవచ్చు, అలాగే 700 మంది ఒకేసారి భోజనం చేసే సదుపాయం కూడా కలదు అంటూ తెలిపారు.
అలా రెండు పెద్ద పెద్ద హోల్లు కలిగి ఉంటాయి. వారంతా భోజనం చేస్తుంటే తాను నమ్మలేకపోయాను అంటూ తెలిపారు శోభా డే. ఇటీవలే ముంబైలోని బాంద్రా లో ఉన్న బాష్టియన్ ను మూసివేసినట్లుగా సోషల్ మీడియా వేదికగా శిల్పా శెట్టి ప్రకటించారు. అయితే దీనిని బాస్టియన్ బీచ్ క్లబ్ అనే పేరుతో జూహులో ఓపెన్ చేయబోతున్నట్లు వెల్లడించింది. తాము ఎన్ని బ్రాంచ్లు తెరిచినా కూడా ఈ బ్రాంధ్రలోని రెస్టారెంట్స్ మాత్రమే వాటికి మూలమని వెల్లడించారు. శిల్పా శెట్టి సినీ కెరియర్ విషయానికి వస్తే..2025లో చివరిగా KD.ది డెవిల్ చిత్రంలో నటించారు.