బిగ్ బాస్ హిందీ  షోకు ఎన్నో ఏళ్ళుగా హోస్టుగా చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు సినిమాలు, మరొకవైపు రియాలిటీ షోతో బిగ్ బాస్ పేరును మరింత పాపులర్ అయ్యేలా చేశారు. సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ లో చేసే ఫన్నీ కామెంట్స్ కూడా బాగా ఆకట్టుకుంటాయి. అలాగే సల్మాన్ ఖాన్ ధరించే దుస్తులు కూడా అట్రాక్షన్ గా కనిపిస్తాయి. అందుకే టిఆర్పి రేటింగ్ కూడా భారీగా రావడంతో సల్మాన్ ఖాన్ కి కొన్ని కోట్ల రూపాయలు ఇస్తూ ఉంటారు బిగ్ బాస్ నిర్వాహకులు.



అయితే తాజాగా సల్మాన్ ఖాన్ హౌస్ లోకి తాగి వచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ హౌస్ లో చాలా భిన్నంగానే ప్రవర్తిస్తుంటారు. తాజా వీడియోలో ముఖం ఉబ్బినట్టుగా కనిపించడం, కళ్ళు కూడా వాచిపోయినట్టు కనిపిస్తూ ఉన్నట్టుగా ఒక వీడియో వైరల్ గా మారింది.దీంతో సల్మాన్ ఖాన్ ఆల్కహాల్ తాగి వచ్చారనే విమర్శలు వినిపించడంతో ఈ విషయంపై అభిమానులు ఖండిస్తున్నారు. ఇటీవలే ఒక సీరియల్ నటుడు మరణించగా ఆయన అంత్యక్రియలకి సల్మాన్ ఖాన్ హాజరయ్యారు, అనంతరం అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ తో ఒక వేదిక మీద మాట్లాడడం జరిగింది.


ఆ తర్వాత నేరుగా ఒక కొత్త సినిమా షూటింగ్లో పాల్గొని మరి ఇండియాకి తిరిగి వచ్చారు సల్మాన్ ఖాన్. ముఖ్యంగా బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ కావడం చేత ఈ బిజీ షెడ్యూల్ వల్ల సల్మాన్ ఖాన్ సరిగ్గా నిద్ర లేదని అందువల్లే అతడి కళ్ళు ఉబ్బిపోయాయని నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల అలా కనిపించారనే విధంగా ట్విట్టర్ ద్వారా ఒక వ్యక్తి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ ని తప్పుగా అర్థం చేసుకొని ఉంటారంటూ అభిమానులు కూడా వెల్లడిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: