టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అందం గురించి పొగడని వారు ఉండరు. అటువంటి మహేష్ బాబు ‘అందగాడు’ కాడు అంటూ ఒక తమిళ కమెడియన్ ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వివాదా స్పద వ్యాఖ్యలు దక్షిణ భారతదేశంలో ఉన్న అనేక మంది మహేష్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి.
Mahesh Babu in 'Bharat Ane Nenu'
ఆసక్తిరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే తమిళ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న మనోజ్ ప్రభాకర్ నటించిన సినిమాలు చాల తక్కువైనా అనేకసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాకు హాట్ టాపిక్ గా మారడం అతడి హాబీ. ముఖ్యంగా తెలుగు టాప్ హీరోల పై ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు ఇతడి చేస్తూ ఉంటాడు. 
Bharat Ane Nenu Box-Office Collection: Mahesh Babu - Kiara Advani's Film Crosses Rs 125 Crore Mark
ఇలాంటి పరిస్థుతులలో మనోజ్ ప్రభాకర్ దృష్టి మహేష్ పై పడింది. చాలమంది మహేష్ అందగాడు అని తెగ పొగుడ్తూ ఉంటారని అయితే తనకు మాత్రం మగ వేషం వేసుకున్న పొడుగు కాళ్ళ సుందరి కత్రినా కైఫ్ లా కనిపిస్తాడని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

అంతేకాదు మహేష్ నటన తాను పరిశీలించినప్పుడు అతడి మోహంలో హావ భావాలు ఏమాత్రం స్పష్టంగా కనిపించక తనకు హైదరాబాద్ లోని పెద్దపెద్ద బండ రాళ్ళు గుర్తుకు వస్తాయి అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. వాస్తవానికి మహేష్ తో ఏవిషయంలోనూ పోటీ స్థాయి మనోజ్ ప్రభాకర్ కు లేకపోయినా ఇలా ఈ కమెడియన్ మహేష్ ను ఎందుకు టార్గెట్ చేసాడో ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది. ఈకామెంట్స్ మీడియాకు హాట్ టాపిక్ గా మారడంతో మనోజ్ ప్రభాకర్ ను టార్గెట్ చేస్తూ మహేష్ అభిమానులు తీవ్రమైన పదాలతో ఈ కమెడియన్ పై మాటల దాడి చేస్తున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: