సురేంద్ర రెడ్డిని టార్చర్ పెట్టింది ఎవరు ? క్రియేటివ్ దర్శకుడు సురేంద్ర రెడ్డి గురించి ‘రేసుగుర్రం’ సక్సెస్‌మీట్‌లో బన్నీ సంచలనమైన వ్యాఖ్యలు చేసి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. సురేందర్‌రెడ్డి ఓర్పును చూసి తన మైండ్ బ్లాంక్ అయిందని మరొక దర్శకుడు అయితే ఆ టార్చర్ భరించలేక మైక్ విసిరేసి ప్యాకప్ చెప్పేసి షూటింగ్ స్పాట్ నుండి వెళ్ళిపోతాడని అని అనడం వెనుక అసలు సురేంద్ర రెడ్డిని టార్చర్ పెట్టింది ఎవరు? అనే విషయం పై ఆ సక్సస్ మీట్ కు వచ్చిన అతిధుల మనసులో అనుమానాలు వచ్చాయి.
సురేందర్‌రెడ్డి సక్సెస్ఫుల్ దర్శకుడే అయినా ఒక సినిమా హిట్టిచ్చాడంటే వెంటనే ఫ్లాప్ ఇవ్వడం అతనికి సెంటిమెంట్ గా మారింది. ‘ఊసరవెల్లి’ తరవాత సురేంద్ర రెడ్డికి తనని తాను నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. అందుకే రేసుగుర్రం కోసం చాలా టైమ్ తీసుకొన్నాడు స్క్రిప్ట్ పైనే ఏడాది కూర్చున్నాడట. సెట్లో కూడా నిదానంగానే పని కానిచ్చేవాడట. దాంతో.. నిర్మాతల నుంచి ప్రెషర్ మొదలైంది అని టాక్. సూటిపోటి మాటలతో సురేందర్‌రెడ్డిని ఏదో ఒకటి అనేవారని..
అయినా సురేందర్‌రెడ్డి కామ్ గా ఉండేవాడని.. యూనిట్‌సభ్యులు చెబుతున్నారు. అందుకే సురేందర్‌రెడ్డి పడిన టార్చర్ గురించి బన్నీ ఇలాంటి కామెంట్లు చేశాడు అంటు కామెంట్లు వినపడుతున్నాయి. మొత్తానికి ఓ హిట్ కొట్టి తన సత్తా ఏమిటో నిరుపించుకున్నాడు సురేంద్ర రెడ్డి. అందుకే కాబోలు ఈ సినిమా సక్సస్ మీట్లో అందరు చూస్తూ ఉండగానే ఆనందాన్ని ఆపుకోలేక ఏడ్చేశాడు సురేంద్ర రెడ్డి.
మరింత సమాచారం తెలుసుకోండి: