ఓడ ఎక్కేదాక ఓడ మల్లన్న .. ఓడ దిగాక బోడి మల్లన్న అన్నట్టుగా ఉంది అమెరికా వ్యవహారం. మొన్నటి వరకు కరోనా  వ్యవహారం అమెరికాను అతలాకుతలం చేసింది. భారీ ప్రాణ నష్టం చోటుచేసుకోవడం, ఈ వైరస్ ను ఎలా అదుపు చేయాలో తెలియక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన చెందడం మొదలైన వ్యవహారాలన్నీ చోటుచేసుకున్నాయి. ప్రపంచ దేశాలకు పెద్దన్న గా గొప్పలు చెప్పుకుంటూ వస్తున్న అమెరికా కరోనా దెబ్బకు విలవిలలాడింది. అమెరికా స్థాయిలో కాకపోయినా భారతదేశంలోనూ ఆ ప్రభావం ఎక్కువగానే కనిపించింది. అయితే మరణాల శాతం తక్కువగా ఉండటం, ఇక్కడ కరోనాను కంట్రోల్ చేయగలగడం వంటివి చోటు చేసుకోవడంతో కాస్త ఊరట కలిగించింది. కరోనా సోకిన పేషెంట్లకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ద్వారా వ్యాధిని అదుపులోకి తీసుకురావడంతో ప్రపంచ దేశాలు కన్ను ఈ మందులపై పడింది. అందుకోసం భారతదేశాన్ని సంప్రదించి ఎలా అయినా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను భారత్ నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు చేశాయి. 

IHG


దానిలో భాగంగానే అమెరికా కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను తమ దేశానికి ఎగుమతి చేయాల్సిందిగా భారత్ ను అమెరికా కూడా కోరింది. అయితే దానికి భారత్ నిరాకరించడంతో ఒక దశలో అమెరికా అధ్యక్షుడు భారత్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయినా భారత్ నుంచి స్పందన రాకపోవడంతో రెండు రోజుల్లో ఈ మందును భారత్ ఎగుమతి చేయకుంటే భారత్ పై  వాణిజ్యపరమైన ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ ట్రంప్ నోరు జారారు. అయితే ఆ తర్వాత వివిధ దేశాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను అమెరికా సహా 30 దేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతి ఇచ్చారు. 

 


ఒక దశలో మోదీని  అమెరికా ఆకాశానికి ఎత్తింది. ఇక ఆ తర్వాత నుంచి మోడీ ట్విట్టర్ కు వైట్ హౌస్ నుంచి ఫాలోయింగ్ మొదలైంది. ఇదంతా ఏప్రిల్ 3 -10 తేదీల మధ్య జరిగిన వ్యవహారం. ఆ తర్వాత ఇక్కడి నుంచి అమెరికాకు మందులు ఎగుమతులు అయ్యాయి. మందులు రావడం పూర్తయిన తర్వాత ఇక భారత అవసరం లేదు అనుకున్నారో ఏమో గానీ, మోదీ ట్విట్టర్ ఖాతా ను అన్ ఫాలో చేసింది వైట్ హౌస్. అంతే కాదు రాష్ట్రపతి కోవింద్‌ను, ప్రధాని కార్యాలయం(పీఎంవో), అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని కూడా అనుసరించడం మానేసింది. దీంతో భారత్ అమెరికా మధ్య  సంబంధాలు దెబ్బతిన్నాయేమో అన్న అనుమానం మొదలైంది. దీంతో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అవకాశవాదం మరోసారి బయటపడిందని, అవసరం తీరక ఇలా వ్యవహరించడం ఏంటి అనే వ్యాఖ్యలై ఇప్పుడు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: