కృష్ణా జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎట్టకేలకు పార్టీకి మంచి ఊపు తెచ్చారు. కొద్ది రోజుల క్రితం మైలవరం నియోజకవర్గంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. నియోజకవర్గం మొత్తం మీద ఐదు పంచాయతీలో మినహా అన్ని స్థానాలను అధికార వైసిపి కైవసం చేసుకుంది. ఇక ఎంపీటీసీ - జడ్పిటిసి ఎన్నికల్లో ఫ్యాన్ జోరు ముందు సైకిల్ బేజారు అయిపోయింది.

అయితే నియోజకవర్గానికి మున్సిపాలిటీ జరిగిన ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ పైచేయి సాధించింది. నియోజకవర్గంలో రెండు పెద్ద పంచాయతీలుగా ఉన్న కొండపల్లి - ఇబ్రహీంపట్నం పంచాయతీలను కలిపి కొండ‌ప‌ల్లి మున్సిపాల్టీ గా ఏర్పాటు చేశారు. తొలిసారి ఈ కొండపల్లి మున్సిపాలిటీ కి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైసీపీ తో సమానంగా 14 వార్డులు గెలుచుకుంది.

అయితే ఇండిపెండెంట్ గా గెలిచిన టిడిపి అభ్యర్థి కూడా టిడిపి గూటికి చేరడంతో ఇక్కడ గెలుపు టిడిపి దే అయింది. దీనికితోడు విజయవాడ ఎంపీ కేశినేని నాని తన ఎక్స్ అఫీషియో ఓటును వేస్తుండడంతో కొండపల్లి గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా సగర్వంగా ఎగర బోతుంది. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర రావుకు ఎట్ట‌కేల‌కు తిరిగి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు దొరికి న‌ట్లు అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో ఉమా త‌న చిర‌కాల రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ చేతిలో 13 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

అప్ప‌టి నుంచి ఆయ‌న రాజ‌కీయంగా వెన‌క ప‌డిపోతూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆయ‌న్ను అరెస్టు చేసి జైలుకు కూడా పంపింది. దీనికి తోడు స్థానిక ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ డీలా ప‌డ‌డంతో ఉమా కాస్త డిఫెన్స్ లో ప‌డ్డారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో టీడీపీ ఓడినా ఇక్క‌డ గెల‌వ‌డంతో ప‌ట్టు నిలుపుకుని .. పార్టీకి మాంచి జోష్ తెచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: