మొత్తానికి వైసీపీ నరసాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తన కోరికను ఇలాగ తీర్చుకున్నారు. సంక్రాంతి పండుగకు తన ఊరికి రావాలని, కోళ్ళపందేల్లో పాల్గొనాలని రాజుగారి చాలా కోరికుంది. అయితే ఢిల్లీ వదిలి రాష్ట్రంలోకి అడుగుపెడితే ఏమవుతుందో బాగా తెలుసు. అందుకనే చాలా కాలంగా ఢిల్లీలోనే కూర్చుని జగన్మోహన్ రెడ్డిపై నోటికొచ్చింది మాట్లాడుతు బురదచల్లేస్తున్నారు. ఈ సంక్రాంతికి ఎలాగైనా నరసాపురంకు చేరుకోవాలని రాజు అనుకున్నారు.


అనుకున్నదే ఆలస్యం వెంటనే కోర్టులో ఒక పిటీషన్ వేశారు. అదేమిటంటే తనపైన ఇప్పటికి ఉన్న కేసుల వివరాలు కావాలని. ఎందుకంటే తాను పండుగ సందర్భంగా రాష్ట్రంలోకి లేదా నియోజకవర్గంలో అడుగుపెడితే ఏదో ఒక కేసు బనాయించి అరెస్టు చేయటానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని గోల మొదలుపెట్టారు. సరే ఈ పిటీషన్ వల్ల ఎంపీకి లాభం ఏమిటో ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఎంపీ మీద పోలీసులు కొత్తగా కేసు పెట్టకూడదని ఏమీలేదు కదా. కోర్టులో నిలుస్తుందా లేదా అన్నది వదిలేస్తే పోలీసులు తలచుకుంటే ఎంపీ మీద కేసుపెట్టడం పెద్ద విషయం కాదు.

సరే ఇఫుడు విషయం ఏమిటంటే రాజుగారు నియోజకవర్గంలోకి అడుగుపెట్టకుండానే సంక్రాంతి సంబరాలు అయిపోయాయి. సంక్రాంతి పండుగలో ఎంతో ప్రిస్టేజిగా నిర్వహించే కోళ్ళపందేలు కూడా ముగిసిపోయాయి. అందుకనే భీమవరంలో పెద్ద హోర్డింగ్ ఒకటి ఏర్పాటు చేయించుకున్నారు. కోడిపుంజును చేతిలో పెట్టుకుని ఉండే ఫొటో ఒకటి తీయించుకుని దాన్ని బాగా ఎనలార్జి చేయించి పే....ద్ద హోర్డింగ్ ఏర్పాటు చేయించుకున్నారు. ఎంపీ మద్దతుదారులు ఎవరో పెద్ద హోర్డింగును ఏర్పాటు చేయించినట్లున్నారు. ఈ హోర్డింగ్ జనాలను బాగానే ఆక్టుకున్నది.

మొత్తానికి సంక్రాంతికి సొంతూరికి రాకపోయినా కోళ్ళపందేల్లో ప్రత్యక్షంగా  పాల్గొనకపోయినా ఒక పందెం కోడిని చేతిలో పట్టుకుని హోర్డింగు తయారుచేయించుకుని జనాలు దృష్టిపడ్డారు. చివరకు రాజుగారు తన కోరికను హోర్డింగ్ ఏర్పాటు రూపంలో తీర్చుకున్నారని జనాలు కూడా సెటైర్లు వేస్తున్నారు. నియోజకవర్గంలోకి అడుగుపెట్టడానికే ఇంత భయపడుతున్న రాజుగారు రేపటి ఎన్నికల్లో పోటీచేయాలని ఎలా అనుకుంటున్నారో అర్ధంకావటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: