కేటీఆర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడుతూ… జీహెచ్ఎంసీలో ప్రస్తుతమున్న అంతమంది అధికారులు, మేయర్, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ అవసరమయిన చర్యలను చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే వరదల వలన నష్టపోయిన ప్రాంతాలతోపాటుగా, వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను త్వరితగతిన సురక్షిత ప్రాంతాలకు మరియు ఫంక్షన్‌హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలని సూచించారు.