నిజామాబాద్ ఎంపీ , కెసిఆర్ కూతురు కవితని ఉద్దేశించి బీజేపీ మంత్రి బండారు దత్తాత్రేయ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చ కి దారి తీసింది " తెలంగాణా ఉద్యమం ఎప్పుడో అయిపొయింది. ఇంకా గొడవలు పెట్టుకోవాలి అనేది వారి ఉద్దేశ్యం అయితే అది వారి ఇష్టం ఇక " అన్నారు ఆయన. ఆమె పేరు చెప్పకుండా ఇన్ డైరెక్ట్ గా ఆయన చేసిన కామెంట్ లు అవి. ఒక లేఖ అంశం లో వీరిద్దరి మధ్యనా వార్ మొదలైంది. జ‌గిత్యాల‌లో ఇ.ఎస్‌.ఐ. ఆసుప‌త్రి ఏర్పాటు అంశం.


పాత క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని కోరుట్ల‌, జ‌గిత్యాల చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో బీడీ కార్మికులు అధిక సంఖ్య‌లో ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. వారి కోసం ప్ర‌త్యేకంగా ఒక ఇ.ఎస్‌.ఐ. ఆసుపత్రిని ఏర్పాటు చేయాల‌నే డిమాండ్ చాన్నాళ్లుగా ఉంది. కవిత ఇక్కడి ఎంపీ ఆమె ఈ విషయం మీద కేంద్రం తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు, కానీ వారి నుంచి సరైన సమాధానం మాత్రం రాలేదు. దీని మీద కేంద్ర మంత్రి దత్తాత్రేయ చాలా కాలం తరవాత స్పందించారు.


జగిత్యాల ఐ ఎస్ ఐ ఆసుపత్రి ఏర్పాటుకి సంబంధించి తనదగ్గరకి ఎప్పుడూ విజ్ఞప్తు ఉ రాలేదు అనీ లిఖిత పూర్వకంగా ఎంపీ కవిత కూడా తనకి ఎలాంటి లేఖలూ రాయలేదు అని మంత్రి అన్నారు. ఇదివరకు విమాన ప్రయాణం లో మాత్రం ఆమె ఒక్కసారి తనతో ఈ విషయం మాట్లాడారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఆ త‌రువాత ఆమె లెట‌ర్ రాయ‌క‌పోయినా స‌రే నిజామాబాద్ ఆసుప‌త్రిని అప్ గ్రేడేష‌న్ చేశామ‌న్నారు.


స‌మ‌స్య త‌న దృష్టికి రాగానే స్పందించామ‌న్నారు. ఎంపీ క‌విత త‌న‌తో గొడ‌వ ప‌డాల్సిన అవ‌స‌రంలేద‌నీ, త‌న కార్యాల‌యానికి వ‌స్తే సాద‌రంగా స్వాగ‌తిస్తామ‌న్నారు. తెలంగాణ ఉద్య‌మం అయిపోయింద‌నీ, గొడ‌వ‌లు ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఒక్క మాట చెబితే ఆ అంశంపై కూడా సానుకూలంగా స్పందిస్తామ‌ని ద‌త్త‌న్న చెప్పారు. కవిత రిప్లయ్ కూడా ఆయన మీద సీరియస్ గా ఉంది, నవంబర్ లో రాసిన లేఖ ఆమె ఇప్పుడు మీడియా కి చూపించడమే కాక దత్తాత్రేయ నుంచి వచ్చిన లేఖని కూడా ఆమె మీడియా కి చూపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: