టీడీపీ ఆవిర్భవించి 35 ఏళ్లు దాటింది. దేశ రాజకీయ చరిత్రలో ఆ పార్టీకి సుస్థిర స్థానం ఉంది. ఓ ప్రాంతీయ పార్టీగా పార్లమెంటులోనే ప్రధాన ప్రతిపక్షంగా పని చేసిన అరుదైన చరిత్ర దాని సొంతం. నేషనల్‌ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్‌.. సమయాల్లోనూ టీడీపీ దేశరాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించిందన్నది చరిత్ర చెబుతున్న సత్యం.

Image result for trs vs tdp


టీడీపీతో పోలిస్తే టీఆర్‌ఎస్‌ కు అంతటి ఘన చరిత్ర లేదనే చెప్పొచ్చు. కాకపోతే.. కేవలం ఇద్దరు పార్లమెంట్‌ సభ్యులే ఉన్నా.. పార్లమెంట్‌లో తెలంగాణ అంశాన్ని చర్చకు తీసుకొచ్చి బిల్లు పాస్‌ చేయించుకుని రాష్ట్రం సాధించుకున్న ఘన చరిత్ర టీఆర్ఎస్‌ సొంతం. ఐతే.. ఇప్పుడు దేశ రాజధానిలో టీఆర్‌ఎస్ పార్టీ భవనాన్ని నిర్మించేందుకు ప్రయత్నించడం విశేషం.



తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఢిల్లీలో వెళ్తే వారికి ఆవాసం ఇచ్చేందుకు ఉన్న ఏకైక అవకాశం ఏపీ భవన్‌ మాత్రమే. ఆ లోటును పూరించేందుకు టీఆర్‌ఎస్‌ ఇప్పుడు ప్రయత్నిస్తోంది. దేశ రాజధానిలో టీఆర్ఎస్ భవన నిర్మాణానికి జోరుగా సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే భూమిని ఆ పార్టీ నేతలు పరిశీలించారు.

Image result for trs office in delhi


ఆయా పార్టీలకు ఉన్న ఎంపీ స్థానాలను బట్టి కేంద్రం ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయిస్తుంది. అయితే ఇలాంటి ప్రయత్నం ఇప్పటివరకూ టీడీపీ పార్టీ ఎందుకనో చేయలేకపోయింది. ప్రస్తుతం చేసే ఆలోచన కూడా ఉన్నట్టు కనిపించడం లేదు. మరి టీఆర్‌ఎస్‌ ను చూసిన తర్వాతైనా ఢిల్లీలో టీడీపీ భవనానికి ప్రయత్నాలు ప్రారంభమవుతాయా.. అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: